టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా వంటి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ కొన్ని సందర్భాలలో కొన్ని విజయవంతమైన సినిమాలను కూడా వదులుకున్నాడు. అలా విజయ్ దేవరకొండ తన కెరియర్ లో వదులుకున్నా రెండు విజయవంతమైన సినిమాల గురించి తెలుసుకుందాం.

నితిన్ హీరోగా నేషనల్ క్రషర్ రష్మిక మందన హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమా ఎంతటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే , ఈ సినిమా కథ మొదట విజయ్ దేవరకొండ వద్దకే వెళ్లిందట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల విజయ్ దేవరకొండ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమా కథ కూడా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందట. కాకపోతే విజయ్ దేవరకొండ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట.


 ఇలా విజయ్ దేవరకొండ తన కెరియర్ లో రెండు మంచి విజయవంతమైన సినిమాలను మిస్ చేసుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమాలో నటించడానికి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: