పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది..చేతిలో వరుస సినిమాలు ఉన్నా కూడా హిట్ సినిమాలు అనేవి లేవు.దాంతో అమ్మడు పరిస్థితి ముందు చూస్తె నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి లా మారింది.ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది..అతి కొద్ది రోజులలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లు అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక హిందీ లో కూడా ఈమె హవా బాగానే నడుస్తుంది.


చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్డేపై గత కొంత కాలంగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. బీస్ట్‌ మూవీ షూటింగ్‌ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్‌ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్‌గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్‌ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. ఇప్పటికే బీస్ట్‌ మూవీ డిజాస్టర్‌తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట..


నష్టాల్లో ఉన్న నిర్మాతలకు పూజ హెగ్డే మరియు ఆమె స్టాఫ్ ఖర్చులు ఇంకా భారంగా మారాయట. దాంతో నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులు తానే కట్టుకోవాలి అంటూ బిల్లు పేపర్లను పంపి షాక్ ఇచ్చారట. గతంలో కూడా పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు..ఇక ముందు అయిన పూజా హెగ్డే తన ధోరణి మార్చుకుంటే బాగుండు అని సదరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: