ప్రేమతో మీ కార్తిక్ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ ఆరెక్స్ 100 తో సూపర్ హిట్ కొట్టడంతో అతని మొదటి సినిమా అదే అని చాలామంది ఆడియెన్స్ అనుకుంటారు. ఆరెక్స్ 100 హిట్ తో యువ హీరోలకు ఈక్వల్ రేంజ్ తెచ్చుకున్న కార్తికేయ తన సినిమాల సెలక్షన్స్ తో కెరియర్ లో మళ్లీ వెనకపడ్డాడు. సినిమా సినిమాకు నటనలో పరిణితి చూపిస్తూ సత్తా చాటుతున్నా సరే ఒక్కటంటే ఒక్క హిట్ కరువయ్యింది యువ హీరో కెరియర్ లో.. అందుకే అతను ఏ కథ పడితే ఆ కథ సెలెక్ట్ చేయకుండా కథల విషయంలో ఆచి తూచి అడుగులేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పించాలని ప్రయత్నించాడు కార్తికేయ. ఆల్రెడీ తెలుగులో నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన కార్తికేయ మరోపక్క కోలీవుడ్ లో అక్కడ స్టార్ హీరో అజిత్ సినిమా వలిమై లో విలన్ గా చేసి మెప్పించాడు. పాత్ర పరంగా తనవరకు పర్ఫెక్ట్ అనిపించుకుంటున్న కార్తికేయ సినిమాని కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో మాత్రం వెనకపడ్డాడు. తెలుగులో అతని చివరి సినిమా రాజా విక్రమార్క ఆ సినిమా రిలీజ్ ముందు హడావిడి చేసినా రిలీజ్ తర్వాత రిజల్ట్ నిరాశపరచింది.

ఇక ఆ సినిమా రిలీజై ఏడాది కావొస్తున్నా తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు కార్తికేయ. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో అయినా కార్తికేయ అనుకున్న విధంగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. యంగ్ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో కెరియర్ మళ్లీ సెట్ రైట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలు అన్ని కార్తికేయని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: