టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్కొక్క దశలో హీరోయిన్లు పాపులర్ అవుతూ ఉంటారు. వారికి క్రేజ్ వాళ్ళు చేసే సినిమాల ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ లు తొలి సినిమాతోనే క్రేజ్ ను భారీ అందుకుని టాలీవుడ్ మొత్తం వీరి గురించే మాట్లాడుకునేలా చేసుకున్నారు. వారెవరో కాదు.. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన కృతి శెట్టి, అలాగే పెళ్లి సందడి సినిమా ప్రేక్షకులను అలరించిన శ్రీ లీల. ఈ ఇద్దరూ కుర్ర హీరోయిన్ ల కోసం యువ హీరోలు మరియు టాప్ హీరోలు అందరూ కూడా పోటీ పడుతున్నారు. 

ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన వరుస సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మ తో సినిమా చేస్తే తప్పకుండా హిట్ వస్తుందని అందరూ హీరోలు భావిస్తున్నారు అందుకే ఆమెతో సినిమాలు చేయాలని క్యూలు కడుతున్నారు. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన ది వారియర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం పై ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండగా ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చి పెడితే కనుక ఆమె టాప్ హీరోయిన్ అవడం ఖాయం అని చెప్పవచ్చు. 

ఇంకొకవైపు వరుస సినిమా అవకాశాలతో ముందుకు దూసుకుపోతుంది శ్రీ లీల. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ధమాకా అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే ఈమె కోసం కూడా హీరోలు క్యూ లు కట్టడం ఖాయం.  ఇప్పటికే ఆమె తో సినిమాలు చేయాలని పలువురు హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారిలో పెద్ద హీరోలు కూడా ఉండడం విశేషం. ఆ విధంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు పెద్ద సినిమాల్లో నటిస్తే తప్పకుండా పెద్ద హీరోయిన్లు అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులలో వీరిద్దరూ నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: