ప్రతి  సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన కొన్ని మూవీ లు మాత్రమే అతి తక్కువ రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటాయి. మరి కొన్ని సినిమాలు కొంత ఆలస్యంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను పొందుతూ ఉంటాయి. 

కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల నుండి ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకో కపోవడం అలాగే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపక పోవడంతో సినిమాలు బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేయక ముందే థియేటర్ ల నుండి వెళ్ళి పోతూ ఉంటాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సమ్మతమే సినిమా జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ  మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన సమ్మతమే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అని టాక్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమ్మతమే చిత్ర బృందం ఒక అప్ డేట్ ను విడుదల చేసింది. ఆ అప్డేట్ ప్రకారం సమ్మతమే సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమ్మతమే సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: