టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన ధనుష్ ప్రస్తుతం 'సార్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ధనుష్ 'సార్' అనే మూవీ తో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. 

మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.  దర్శకుడు వెంకీ అట్లూరి చివరగా నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన రంగదే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే సార్ మూవీ లో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నడుస్తూ ఉండగా , ఈ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.  

మూవీ యూనిట్ విడుదల చేసిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సార్ సినిమాను తెలుగు మరియు తమిళ్ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: