యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. అయితే ఇటీవల ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన కథలు  చాలానే ఉన్నాయి.అయితే  ప్రతిరోజూ పదుల సంఖ్యలో డైరెక్టర్లు కథలు చెబుతుండటంతో ఏ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో ఏ కథకు నో చెప్పాలో తారక్ కు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.తారక్ రిజెక్ట్ చేసిన కథలు రవితేజ కెరీర్ కు మాత్రం హెల్ప్ అయ్యాయి.

 ఇక వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన తారక్ రిజెక్ట్ చేసిన కథలతో రవితేజ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.ఇకపోతే కెరీర్ తొలినాళ్లలో మాస్ సినిమాలలో నటించిన తారక్ తో చాలామంది దర్శకులు మాస్ సినిమాలు తీయాలని భావించారు.కాగా  స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర కథను తారక్ కు చెప్పగా కథ నచ్చినా ఒక్కడు సినిమా పోలికలు ఉండటం, ఇతర కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి తారక్ అంగీకరించలేదు.ఇక  ఆ తర్వాత ఇదే కథలో నటించడానికి రవితేజ అంగీకరించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం జరిగింది.

అయితే ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన కిక్ సినిమాలో నటించే అవకాశం మొదట ఎన్టీఆర్ కు దక్కగా కొన్ని కారణాల వల్ల తారక్ ఆ సినిమాను వదులుకున్నారు.పోతే  ఆ తర్వాత రవితేజ ఇదే కథలో నటించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే వీవీ వినాయక్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన కృష్ణ సినిమాలో నటించే అవకాశం మొదట తారక్ కు దక్కింది. ఇకపోతే తారక్ వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఇక ఈ విధంగా తారక్ వదులుకున్న కథలు రవితేజకు లక్ ను తెచ్చిపెట్టాయి. అయితే తారక్ ఈ సినిమాలలో నటించి ఉంటే మాత్రం తారక్ ఖాతాలో మరో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు చేరి ఉండేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: