అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఉన్నటు వంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , రెబల్ స్టార్ ప్రభాస్ వంటి వారితో  పాటు మరో కొంత మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన త్రిష ఆకరిగా 'నాయకి' అనే తెలుగు మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. నాయకి మూవీ తర్వాత త్రిష తెలుగు లో ఇప్పటి వరకు ఏ మూవీ లో కూడా నటించలేదు.

ప్రస్తుతం త్రిష తమిళ ఇండస్ట్రీ మూవీ లలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా తమిళ్ లో ఎక్కువగా త్రిష లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం త్రిష గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ సరసన ఛాన్స్ కొట్టేసి నట్లు తెలుస్తోంది.  తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష ను హీరోయిన్ గా తీసుకోవాలని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: