త్రివిక్రమ్ తన సినిమాలను ఎంత బాగా ఉండేలా చూసుకుంటాడో అంతే త్వరగా తన సినిమాలను విడుదల చేసుకునే విధంగా కూడా చూసుకుంటాడు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేసి విడుదల చేయగలిగే టాలీవుడ్ దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఆ విధంగా ఇప్పుడు చేస్తున్న మహేష్ బాబు సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడం మహేష్ అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న ఈ మూడవ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజ యాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న అంచనాలను అభిమానులు కలగజేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఇటీవల కాలం లో మొదలయ్యింది. తొందర్లోనే ఈ సినిమా యొక్క అప్డేట్ ను కూడా విడుదల చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా మహేష్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

మొన్నటికి మొన్నే ఈ సినిమా యొక్క షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పిన నేపథ్యంలో అప్పుడే అప్డేట్ ను విడుద ల చేయడం వారిని ఎంతగానో సంతోషపడుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేయబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో రెండో హీరో యిన్ గా శ్రీలీలా నటిస్తుందని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. తమన్ సంగీతం సమకూర్చగా దీనికి సంబంధించిన పనులన్నీ ఎప్పుడో పూర్తయ్యా యి. మరి హ్యాట్రిక్ కాంబో గా వస్తున్న ఈ సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంతటి స్థాయి సినిమాలను తెరకెక్కిస్తాడో ప్రతి ఒ క్కరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: