సినిమా పరిశ్రమలో ఇద్దరు హీరో ల మధ్య స్నేహం ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. ఒకరి సినిమాల విడుదల సమయంలో మరొకరు సహాయం చేసుకోవడం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలా ఈ దసరా కి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒకే సారి విడుదల కాబోతు ఉండడం నిజంగా అందరిలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అలాగే అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రం రెండు కూడా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. అదే రోజున బెల్లంకొండ గణేష్ హీరో గా నటిస్తున్న స్వాతి ముత్యం కూడా విడుదల కాబోతుంది.

అలా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ఏ సినిమా హిట్ అవుతుందో అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ విడుదల విషయంలో పోటీపడడం నిజంగా చాలా సార్లు జరిగింది. కానీ ఈ సారి ఇది స్పెషల్ గా మారింది అని చెప్పాలి. మొదటినుంచి ఈ రెండుసినిమాలను బాలీవుడ్‌లో విడుదల చేయాలని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి.  సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తే బజ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే చిరంజీవి నో చెప్పాడని ఈ సినిమా మెయిన్ గా తెలుగులోనే విడుదల కాబోతుందని అంటూన్నారు. అలాగే నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు కొందరు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ ఇచ్చారట. అయితే నాగార్జున దీనిపై ఏ విషయం తేల్చలేదు అని తెలుస్తుంది. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమా లో నాగ్ కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. అయన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ నేపత్యంలో ఈ సినిమా లు వారికీ ఏ స్థాయి లో విజయాలను తెచ్చి పెడతాయో చూడాలి. ఈ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో ఇరు హీరో లు కూడా ఒకరి సినెమాలకు ఒకరు అల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: