అనసూయ భర్త భరద్వాజ్ ఊళ్ళో లేడంట. ఆ విషయాన్ని చాలా బాధగా చెబుతుంది అనసూయ. బెడ్ పై పడుకున్న అనసూయ క్రేజీ వీడియో కూడా షేర్ చేసింది. భర్త పక్కన లేకపోతే చాలా ఇబ్బంది అన్నట్లు బాధపడిపోయింది.


యాంకర్ అనసూయకు భర్త భరద్వాజ్ అంటే వల్లమాలిన ప్రేమ. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఏమో కానీ ఆయన మీద అమితమైన ప్రేమ కురిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరట. ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఈ క్రమంలో తన ఒంటరి తనాన్ని అనసూయ ఫ్యాన్స్ కి వీడియో రూపంలో తెలియజేసిందట.


 

బెడ్ పై పడుకున్న అనుసూయ పక్కనే ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ చూపించింది. ఇక సదరు వీడియోకి కామెంట్ గా భరద్వాజ్ ఇంట్లో లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుందని కామెంట్ కూడా పెట్టింది. పర్సనల్ విషయాన్ని అంత పబ్లిక్ గా చెప్పేసిన అనసూయ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే. అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ కాగా... నెటిజెన్స్ నచ్చిన కామెంట్స్ చేస్తున్నారట..


 

ఇక అనసూయ కెరీర్ మూడు పూలు ఆరు కాయలన్నట్లుంది. నటిగా, యాంకర్ గా రెండు రంగాల్లో ఆమె రాణిస్తున్నారు. వెండితెరపై విరివిగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అనసూయ యాంకరింగ్ మీద ఫోకస్ తగ్గించారట.


 

ఆమెకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోని అనసూయ వదిలేసిన విషయం తెలిసిందే. అనసూయ నిష్క్రమణతో యాంకర్ రష్మీ ఆ బాధ్యతలు అయితే తీసుకున్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోష్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ చేతిలో ప్రస్తుతం ఒకటి రెండు షోస్ కంటే ఎక్కువ లేవు.


 

ఇక అనసూయ హీరోయిన్ గా నటించిన దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇవి రెండు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈక్రమంలో హీరోయిన్ గా ఆమెకు ఆఫర్స్ తగ్గుతున్నాయని అనిపిస్తుంది.


 

ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలు చేస్తున్నారట.. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఆమె దేవదాసి రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. పుష్ప లో దాక్షాయణి గా మాస్ లుక్ లో ఆమె అలరించారు.


 

ఇక కెరీర్ సాఫీగా సాగుతుండగా అనసూయ అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నారు. ఇటీవల ఆమె లైగర్ మూవీ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ  కామెంట్ చేయగా వివాదాస్పదమైంది.


 

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు ఆ వివాదం నడిచింది. లైగర్ వివాదం పరిశ్రమలో అనసూయ ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో పాటు అవకాశాలు  కూడా దూరం చేసినట్లు వార్తలొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: