పవర్ స్టార్ వీరాభిమానులు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో మరొక బ్లాక్ బష్టర్ మూవీని ఆశిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలలోని పవన్ పాత్రలు ‘గబ్బర్ సింగ్’ రేంజ్ లో లేకపోవడంతో అతడి అభిమానులకు ఆ సినిమాలు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేకపోయాయి అని అంటారు.



హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ కథను తయారుచేసి గత రెండు సంవత్సరాలుగా అతడి గురించి వెయిట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ మూవీ టైటిల్ ను ప్రకటించడమే కాకుండా ఈ మూవీ ప్రారంభోత్సవం కూడ జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ పైకి వెళుతుందో హరీష్ శంకర్ కు కూడ తెలియనిపరిస్థితి.



పవన్ కళ్యాణ్ రెండు పడవల సిద్దాంతం వల్ల అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు ఇలా ఏవిషయంలోను తన పూర్తికాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దర్శకుడు హరీష్ శంకర్ ఒక కథను తయారు చేసి ఆకధతో బాలకృష్ణను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ విజయంతో బాలకృష్ణ మార్కెట్ బాగా పెరిగింది. బాలయ్య కెరియర్ లో అత్యధిక కలక్షన్స్ ఇచ్చిన మూవీగా ‘వీరసింహా రెడ్డి’ మారడంతో వరసగా రెండవసారి 100 కోట్ల హీరోగా మారడంతో బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు.



ప్రస్తుతం అతడు అనీల్ రావిపూడి మూవీలో నటిస్తున్నప్పటికీ ఈ మూవీ తరువాత అతడు నటించవలసిన సినిమాల పై దృష్టి పెట్టడంతో బాలయ్య దృష్టిని తనవైపు తిప్పుకోవాలని హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం వ్రాసిన ఒక కథకు మార్పులు చేర్పులు చేసి బాలయ్యతో సినిమా చేస్తాడా లేదంటే అతడి కోసం మరొక కొత్త కథను వ్రాస్తున్నాడా అన్నవిషయమై ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు అని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: