సౌత్ స్టార్ హీరో ధనుష్ తాజా గా నటించిన మూవీ కుబేర .. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు.. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ , సునీల్ రామ్మోహన్ రావ్‌ నిర్మించారు .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది .. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది .. మొదటి రోజు కాస్త స్లోగా మొదలైన కుబేర మౌత్ టాక్ తో ఊహించని జట్ స్పీడ్ ను అందుకుంది .. ధనుష్ హీరో గా చేసిన‌ రెండో స్ట్రైట్ సినిమా కూడా సూపర్ హిట్ అనే టాక్ తో అదరగొడుతుంది .. అయితే ఇప్పుడు కుబేర బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకోవటంతో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్ ..


ఇక అందుకోసం కుబేర సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు .. అయితే ఈ వేడుకలకు ముఖ్య అతిథి రాబోతున్నారు .  టాలీవుడ్ లో వచ్చే మంచి సినిమాలను ఎప్పుడూ ముందుండి ఎంకరేజ్ చేసే చిరంజీవి ఇప్పుడు కుబేర కోసం ముందుకు వస్తున్నారు .  ఈరోజు సాయంత్రం జరగబోయే ఈవెంట్ కు చిరు తో పాటు మరికొందరు ప్రముఖుల సమక్షంలో మాత్రమే ఈవెంట్ నిర్వహించబోతున్నారు .  అలాగే మరో పక్క అక్కినేని ఫ్యాన్స్ ను కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కు ఎవరిని ఈవెంట్ కు అనుమతించడం లేదని తెలుస్తుంది .. కాగా కుబేర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది .. ఇక ఈరోజు వీకెండ్ కావడం తో  కుబేర అడ్వాన్స్ బుకింగ్స్ లో మరింత జోరు కనిపిస్తుంది ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: