ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లాటరీలు నిర్వహిస్తూ ఉంటాయి కొన్ని దేశాలు. ముఖ్యంగా దుబాయి దేశంలో ఈ లాటరీలు ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో సైతం లాటరీలు చట్టబద్దంగా నిర్వహిస్తారు. ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ నిర్వహణ జరుగుతుంది. అయితే ఎక్కడైనా సరే కోట్ల రూపాయల భారీ మొత్తమే లాటరీలో ప్రకటిస్తారు. అయితే స్పెయిన్ లో క్రిస్మస్ వేడుకలని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లాటరీ ఇప్పుడు అందరిని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేస్తోంది.

 

ఎల్ గోర్డో పేరుతో పిలిచే ఈ లాటరీని పార్టీ ఏడాది డిసెంబర్ 22 వ తేదీన డ్రా తీస్తారు. ఈ క్రమంలోనే నిన్నటి రోజున స్పెయిన్ లో జరిగిన ఈ లాటరీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇంతకీ ఈ లాటరీ విలువ ఎంతో తెలుసా అక్షరాలా 17 వేల కోట్లు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన  లాటరీలలో ఇదే అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ లాటరీలో 26590 అనే నెంబర్ కి ఈ మొత్తం వస్తుందని తెలిపారు. అయితే

 

26590 ఎంతమందికి వస్తే వారదరికీ 3 కోట్లు చప్పున ఈ మొత్తం ఇచ్చేస్తారని తెలిపారు. అలాగే ఈ లాటరీ లో 3 కోట్లు పొందిన వాళ్ళు సుమారు 60 లక్షల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. మరి 26590 టిక్కెట్టు ఇప్పటికి ఎంతమందికి వచ్చిఉంటుందో..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: