కరోనా వ్యాధి సోకి ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా(78) మరణించాడు. గత కొంతకాలంగా కరోనా అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఈయన న్యూయార్క్ సిటీ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్‌గా మంచి పేరు ఉంది. అంతే కాకుండా అమెరికాలో స్టాన్లీ కి చాల వ్యాపారాలు కూడాఉన్నాయి.ట్రంప్‌కు చెందిన రిప‌బ్లిక‌న్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు.రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం క్రౌన్ అక్వీసీషన్స్‌ పేరుతో చేస్తున్నారు.

 

అదేవిధంగా ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషనర్‌తోనూ స్టాన్లీకి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. అమెరికా ఎన్నికలలో ట్రంప్ పార్టీ తరుపున స్టాన్లీ 4 లక్షల డాలర్లను పార్టీ ఫండ్ కింద అందజేశారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్టాన్లీ తన ప్రాణ మిత్రుడు అని ఓ కార్యక్రమం లో చెప్పారు. అమెరికాలో ఇప్పటి వరకు 492881 కేసులు నమోదు కాగా 18516 మరణాలు సంభవిందాయి . ఇప్పటికి అమెరికా కరోనాను కట్టడికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనేఉంది. కానీ రోజు రోజుకు అమెరికాలో పెరుగుతున్న మరణాలు అమెరికా ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: