అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ పేరు వింటే చాలు అమెరికా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాంప్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ట్రంప్ పై సీరియస్ అవుతున్నారు.  అసలు ఈ కరోనా సమయంలో ఇలా చెయ్యడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. 

 

ఇంతగా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. అయితే ఈ ఎన్నికల కోసమే డోనాల్డ్ ట్రాంప్ ఈ నెల 20 న ఓక్లహోమాలోని టుల్సా నగరంలో భారీ ఇండోర్ ర్యాలీని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కార్యకర్తలు అంత కూడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 

 

 

ప్రతి ఇద్దరి మధ్య ఒక సేతు ఖాళీగా ఉండేలా స్టిక్కర్ అతికించారు. అయితే ర్యాలీకి ట్రంప్ వచ్చే కొన్ని క్షణాల ముందు అయన పార్టీ వలంటీర్లు స్టిక్కర్లను తీసేసీ, భౌతిక దూరం నిబంధన అమలు కాకుండా చేశారు. ఇంకా ఇది అంత ఓ ప్రముఖ మీడియా సంస్ద ప్రసారం చెయ్యం ఆ వీడియో కాస్త అప్పటి నుండి వైరల్ అవుతుంది. 

 

ప్రస్తుతం నెట్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రతను పట్టించుకోకుండా ఎన్నికల ర్యాలీని నిర్వహించిందే కాకుండా.. భౌతిక దూరం నిబంధన కూడా అమలు చేయరా అంటూ అతన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటికే ట్రంప్ పై సీరియస్ ఉన్న అమెరికన్లకు ఈ వీడియో అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: