కొన్ని గంటల వ్యవధిలో బిడెన్, కమలా హరీస్ ల ప్రమాణ స్వీకారం జరగనుంది. బిడెన్ టీమ్ అన్ని ఏర్పాట్లు చక్కబెట్టారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏం చేయాలి, ఎలాంటి ఆనవాయితీలు ఉంటాయి. ప్రసంగాలు ఎలా ఉండాలో ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం సిద్దం చేశారు. ఉదయం మొదలు సాయంత్రం వరకూ అధ్యక్ష, ఉపాధ్యక్షుల షెడ్యూల్ ఫుల్ బిజీ బిజీ గా ఉండబోతోంది. కట్టుదిట్టమైన బద్రత మధ్య జరగబోతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 20 వేలమందికి పైగా సైనికులను రక్షణగా నియమించారు. నేషనల్ గార్డ్ వాషింగ్టన్ ప్రాంతం మొత్తం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం  ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

       వేడుకలకు ముందుగా ఉదయం 7 గంటల నుంచీ 9:30 వరకూ యువ అమెరికన్స్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకలో యువ అమెరికన్స్ కోసం ప్రెసిడెన్షియల్ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయాది పామర్ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమం ప్రత్యక్ష 

       ప్రసారం అవుతుంది. ఈ సమయంలోనే అమెరికా ప్రధమ మహిళగా కాబోతున్న జిల్ తన సందేశాన్ని వినిపిస్తారు.


      ఈ వేడుకలను BidenInaugural.org/youth లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

      తరువాత గత అధ్యక్షుల మాదిరిగానే బిడెన్ , కమలా హారీస్ లు క్యాపిటల్ భవనం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సమయంలోనే బిడెన్ , కమలా హరీస్ ల ప్రసంగం కూడా ఉంటుంది. అమెరికాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కరోనా మహమ్మారి కట్టడిపై ఏం చేయబోతున్నాం అనే ప్రసంగాలు ఉంటాయి..


      ఈ వేడుకలకు మాజీ అధ్యక్ష ఉపాధ్యక్షులు హారవబోతున్నారు, లేడీ గాగా  అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు, ఇక జెన్నిఫర్ లోపెజ్ ,గార్త్ బ్రూక్స్, ఇలా పలువురు అలరిస్తారు.  ఈ ప్రసారం మొత్తం  KTLA.COM లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

      ఆ తరువాత బిడెన్, కమలా హరీస్ లు అన్ని సేవా శాఖల నుంచీ సాంప్రదాయక పాస్ ఇన్ రివ్యూ  పూర్తవుతుంది. ఈ క్రమంలోనే కమాండర్ ఇన్ చీఫ్ కు అధ్కారాలను బదిలీ చేస్తారు.


      వీర మరణం పొందిన దేశ సైనికుడి ను గౌరవించుకునే విధంగా కమలా హారీస్, బిడెన్ ను అర్లింగ్టన్ లోని సమాదివద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారు. ఈ వేడుకలలో మాజీ ఉపాధ్యక్షులు పాల్గొంటారు.


      తరువాత బిడెన్ తనకు అధికారికంగా వచ్చే ఎస్కార్ట్ లను అందుకుంటారు;ఇందులో మిలటరీ కి చెందిన అన్ని డిపార్ట్మెంట్ లు పాల్గొంటాయి. అందరిని కలుపుకుంటూ వెళ్ళే ఈ కార్యక్రమం వర్చువల్ గా ప్రదర్సింపబడుతుంది.


      అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ పరేడ్ నుంచీ స్వాగతులను అందుకుంటారు. ఈ కవాతులో మొత్తం 56 రాష్ట్రాలు పాల్గొంటాయి. ఈ కవాతులో ప్రముఖ దర్శకుడు, నిర్మాత టోని గోల్డ్ విన్ హాజరవుతారు. ఇక


      8 :30 గంటలకు టామ్ హాంక్స్ హోస్ట్ చేసిన ప్రైమ్ టైం టెలివిజన్ స్పెషల్ తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సమయంలోనే బిడెన్, కమలా హారీస్ ల ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: