దివంతగ ముఖ్యమంత్రి  వైఎస్ఆర్ తమకు రాజకీయ బిక్షపెట్టారని, అందుకోసమే వారు తమ  అనుచరులతో వైకాపాలో కొనసాగుతుండగా చివరకు వైకాపాలో కూడా కొండ సురేఖ దంపతులకు తగిన విధంగా పరాభవం ఎదురైంది. అందుకే దంపతులిద్దరు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు.

రాజశేఖర్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోగానే కొండ సురేఖ జగన్ కు అండగా ముందువరుసలో నిల్చున్నారు. దీంతో పాటు మంత్రి పదవికోసం రాజీనామచేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామ చేసిన సురేఖ వైఎస్ఆర్ పై ఉన్నటువంటి గురుభక్తిని చాటుకున్నారు. జగన్ కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న కొండ సురేఖ జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్పఓట్లతో పరాజయం పాలైంది.

తెలంగాణ ప్రాంతంనుండి వైకాపా నాయకురాలుగా మంచి స్థానం సంపాదించినట్టి కొండ సురేఖకు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. తన అనుచరులను పార్టీనుండి సస్పెండ్ చేయడంతో సురేఖకు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కొంతమంది కుట్రలు చేసి సురేఖను పార్టీ నుండి బయటకు పంపించేందుకు రంగం సిద్దం కావడంతో గ్రహించిన సురేఖ చివరకు తానే పార్టీనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.  కొండ దంపతులది వారి వ్యక్తిగతమైన ప్రజాబలం అయినప్పటికిని తెలంగాణలో వైకాపా నుండి బలమైన శక్తిగా రాణించారు. అయితే వైకాపా కోసం పార్టీని కూడా బార్య, భర్తలు కోల్పోయారు.  ఇటువంటి పరిస్ధితిలో సురేఖ దంపతులకు కాంగ్రెస్, బీజెపిలనుండి ఆహ్వానాలు అందాయి. వారు ఏపార్టీలో చేరిన వారి వ్యక్తిగతంతో పాటు పార్టీ బలం తోడై భవిష్యత్తులో గెలిచే అవకాశమున్నప్పటికిని నమ్మిన వైకాపా తనను మోసం చేసిందని, తాను త్యజించిన పదవులకు గుర్తింపు లేకుండా పోయిందనే బాధ మాత్రం సురేఖ దంపతులకు వెంటాడుతుంది. ఇటువంటి తరుణంలో కొత్తగా వైకాపాలో చేరుదామనుకునేవారికి కొండ దంపతుల విషయం గుర్తుకు వచ్చి చేరిక ప్రయత్నాన్ని విరమించుకునే పరిస్ధితి రావచ్చు. ఎందుకంటే అంతటివారికే ఇలా జరిగితే తమ భవిష్యత్తు ఏంటోననే విషయంలో ఆలోచించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: