తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు తొలిముఖ్యమంత్రి పదవి దళితుడికే ఇస్తామని టిఆర్ఎస్ ప్రకటించించగా  తాను ఆపదవికి ఎందుకు అర్హున్ని కాదనుకున్నాడో ఏమోగాని టిడిపిలో సీనియర్ నేతగా పేరుతెచ్చుకున్న కడియం శ్రీహరి టిఆర్ఎస్ లో తన సీటును ఆపుకున్నారు. ఎవరు ఊహించని విధంగా కడియం శ్రీహరి టిడిపికి రాజీనామ చేసి టిఆర్ఎస్ లో చేరడం కోసం సిద్దమయ్యారు.

రెండుమూడు రోజుల్లో టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్న కడియం శ్రీహరిని టిఆర్ఎస్ లోకి రప్పించడానికి ఎంతో కాలంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కృషిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇద్దరు కలిసి పనిచేసిన అనుభవంతో పాటు కడియం శ్రీహరికి ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని బట్టి అటువంటి నాయకులు టిఆర్ఎస్ లో ఉంటే ప్రయోజనంగా ఉందనుకున్న కెసిఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఎట్టికేలకు తన కుమారుడు కెటిఆర్ ను రాయబారిగా పంపి తన కోరికను సాధించుకున్నారు. కడియం శ్రీహరిలాంటి నాయకులు టిడిపి వదిలి టిఆర్ఎస్ లో చేరితే మరింతమంది ఏమాత్రం ఆలోచించకుండా టిఆర్ఎస్ లో చేరుతారనేది కెసిఆర్ ఆలోచన.

నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే తొలిముఖ్యమంత్రి పదవి దళితుడికే ఇస్తే కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉండవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ముందు, వెనుక ఉండదని ఉద్యమంలో వెనుకొచ్చినవారు, ముందొచ్చినవారుండరనే భావన ఇప్పటికే కెసిఆర్ పలుమార్లు వ్యక్తం చేశారు. బహుశ అందుకే కావచ్చు ముందుగా చేరినవారందరు పార్టీలో కనుమరుగై పోయి కొత్తవారు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడున్నవారు కూడా కొంతకాలానికి పాతవారై కనుమరుగు కావడం జరిగితే జరుగవచ్చుగాని అంతలోతుగా మనకెందుకులే... ఇప్పుడున్నటువంటి పరిస్ధితిలో కెసిఆర్ అనుకున్నట్లుగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే కడియం శ్రీహరి కూడా ముందు వరుసలో ఉంటారనే హామితోనే కడియంకు గాలం వేసి ఉంటారని కొంతమంది అనుకుంటుండగా, వచ్చే ఎన్నికల్లో కడియంను పార్లమెంటుకు పంపి కలిసివస్తే కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: