ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని చత్తీస్ ఘడ్, విశాఖ జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పలు విద్వంసలకు పాల్పడ్డారు. దీంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగగా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భద్రత సిబ్బందితోపాటుమరో జవాన్ మృతిచెందారు.  కాగా సంఘటన స్థలంలో భధ్రత సిబ్బందినుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జమలపూర్ లో గల దూరదర్శన్ రిలేకేంద్రాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. దూరదర్శన్ కేంద్రంపై దాదాపు 50మంది సాయుదులైన మావోయిస్టులు దాడిచేసి కాపలగా ఉన్న భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు సిబ్బంది చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా సుకుమా జిల్లాలోని పెమ్మినగూరులో ఉన్నటువంటి పోలీసు క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరుపగా ఒక జవాన్ మృతిచెందారు. అదే విధంగా విశాఖ జిల్లాలో కాఫీ తోటను మావోయిస్టులు ద్వంసం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: