చేయాల్సిందల్ల చేసిన తర్వాత, జరుగాల్సినదంతా జరిగిన తర్వాత తాము ఏతప్పు చేయలేదని వాదిస్తున్న దేశ ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. కేంద్రమంత్రి పదవులకు భలవంతంగా రాజీనామచేసిన ఇద్దరు మంత్రులు దేశప్రతిష్షతను మంటగలిపిన తర్వాత తప్పుమాదికాదంటూ నమ్మబలుకుతున్నారు.

వీరిని  మంత్రిపదవుల నుండి ఎప్పుడో తప్పించాల్సి ఉండగా అవినీతికి మారుపేరుగా పిలువబడుతున్న కాంగ్రెస్ వీరిని వెనుకేసుకొచ్చింది. అనంతరం ప్రతిపక్షాలనుండి వత్తిడి పెరిగిన తర్వాత పదవులనుండి తప్పించింది. ఒక వేళ ప్రతిపక్షాలు అంతగా పట్టించుకోకపోతే వారు అలాగే కొనసాగేవారు. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో తమ పరువును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని ఆ ఇద్దరు మంత్రులను తప్పించినప్పటికిని ప్రధానమంత్రి రాజీనామ చేయాలనే ప్రధాన డిమాండ్ ను ప్రధాన ప్రతిపక్షం వదులడం లేదు. దేశప్రధానిగా మన్మోహన్ సింగ్ వరుసగా 10సంవత్సరాలపాటు పదవిలో కొనసాగాడని రికార్డును సృష్టించవచ్చుగాని అవినీతి మంత్రులను వెనుకేసుకొచ్చిన ప్రధానిగా మాయని మచ్చవేసుకున్నారు.

పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తనకున్న చెడ్డపేరు తుడిపేసుకునేందుకు ఇద్దరు మంత్రులను తొలగించడంతో సరిపెట్టుకుంది. అయితే బొగ్గు కుంభకోణం వ్యవహారం మాత్రం ప్రధానిని వెంటాడే విధంగా కనిపిస్తుంది. అశ్వనీకుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్ధితి రాకుండా కాపాడేందుకు ప్రధాని విఫలయత్నం చేశారు. కాగా ఆయన రాజీనామా తర్వాత అందరి దృష్టీ ప్రధాని కార్యాలయం మీదకు వెళ్లింది. పీఎంఓ, బొగ్గుశాఖ సంయుక్త కార్యదర్శులు సీబీఐ నివేదికలో కల్పించుకోవడానికి కారణాలెవరనే విషయంలో సుప్రీంకోర్టు వెంటబడి శోదిస్తే రానున్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవు. అందుకే ఇద్దరు మంత్రులను తప్పిస్తే ఇంతటితో ఆగిపోతుందని అనుకుంటే తప్పిదమే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: