
1999లో వాజ్ పేయితో బస్సు యాత్ర తలపెట్టినప్పుడు ప్రపంచ స్థాయి రాజనీతి లక్షణాల నాయకుడని అన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న నవాజ్ ప్రభుత్వాన్ని ముషారఫ్ సైనిక చర్యతో కూలదోసి, నవాజ్ పై లేనిపోని కేసులు పెట్టి ప్రవాసానికి సాగనంపారు. ఇప్పుడు ముషారఫ్ అరెస్టులో ఉన్నా నమ్మడానికి లేదు. సైన్యంతో కలిసి కుట్రలను చేయడాన్ని నమ్మలేం.అలాగే తాలిబన్లు కూడా తెగిస్తున్నారు. దీంతో నవాజ్ కు పాలన అంత ఈజీ కాదని గుర్తించుకోవాలి. అయితే ఇన్నేళ్లు ఓపికగా వేచి చూసిన నవాజ్ 66 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న అధికార మార్పిడికి ఆయన కేంద్ర బిందువు అయ్యారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా పొరుగుదేశంతో శాంతి చర్చలు పున: ప్రారంభిస్తానని ప్రతిన భూనారు. సైనిక కుట్రతో షరీఫ్ ను గద్దె దించి, దేశం నుంచి పారదోలి ముషారఫ్ తానే పాకిస్థాన్ పాలకుడయ్యారు . అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత వరకు కుదుట పడలేదు . అందుకే నవాజ్ షరీఫ్ ప్రధాని కావడం భారత్ కు అత్యంత శుభవార్త. పద్నాలుగేళ్ళ నాటి సైనిక కుట్రలో అధికారం కోల్పోయి, జైలు పాలై, ప్రవాసజీవితం గడిపిన నవాజ్ మూడవసారి ప్రధాని మంత్రి అవుతారని సర్వేలు చేప్పినట్లు నిజమైంది. నిజాయతి పరుడన్నముద్రతో బరిలోకి దిగిన ఇమ్రాన్ సారధ్యంలోని తెహ్రీకె-ఇన్సాఫ్ పార్టీ 37సీట్లతో రెండో స్థానం దక్కించుకుంది.