చైనా మైండ్ గేం లో పడ్డ నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహృ చైనా అధినేత చౌ-ఎన్-లై పంచశీల పై 1954 లో సంతకం చేసి వెనుకకు తిరిగిన వెంటనే చైనా వెన్నుపోటు పొడిచి భారత్ పై దాచేసింది. వారి తియ్యని మాటల వెనుక ఎంత తియ్యని విషం దాగుందో భారత్ కు పూర్తి అవగాహన ఉందని నరెంద్ర మోడీకి బాగా తెలుసు. అందుకే చిరుదరహాసం తో బ్రిక్స్ వేదికపై కనిపించారు తప్ప పొంగిపోయిన ధాఖలాలు కనిపించలేదు.

 asia africa growth corridor map కోసం చిత్ర ఫలితం

నేటి చైనా తీయని మైండ్ గేం వెనకనున్న మధుర విషమేమంటే "చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా" లతో కలసి భారత్ ఒక ఆర్ధిక కారిడార్ నిర్మించాలని గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తోంది. సైనిక పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భారత సర్కారు నమో నాయకత్వములో ముందుకెళ్తోంది.

 

ముఖ్యంగా జపాన్‌తో మనం జోడీ కట్టడం అలా కలిసి ముందుకు నడవడం చైనా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు, చైనాకు కొరుకుడు పడటం లేదు. చైనా ప్రత్యర్థి ఆ గర్భ శత్రువైన జపాన్‌ను ఇప్పుడు దెబ్బ కొట్టాలంటే, రాజకీయంగా, దౌత్య పరంగా భారత్‌ను తన మిత్రదేశంగా దారిలోకి తెచ్చుకోవడమే మార్గం అని డ్రాగన్ చైనా మనసులో భావన.

 asia africa growth corridor map కోసం చిత్ర ఫలితం

అందుకే జపాన్ తన ప్రణాళికతో సిద్ధం చేసి ఇప్పటికే భారత్ ఆమోదం తెలిపిన "ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్"  విషయంలో నెమ్మదిగా ముందుకెళ్లాలని ఇండియాను చైనా నాయకత్వం కోరుతోంది. ఆఫ్రికా మార్కెట్ కోసం చైనా ఏర్పాటు చేస్తున్న సిల్క్ రోడ్డుకు (వన్ బెల్ట్ వన్ రోడ్) ప్రత్యామ్నాయంగా జపాన్‌తో కలిసి భారత్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఆఫ్రికా డెవలప్‌ మెంట్ బ్యాంక్ సహకారంతో, దక్షిణాఫ్రికా లాంటి అనేక ఆఫ్రికా దేశాలను కలుపుకొని భారత్, జపాన్ ఆసియా ఆఫ్రికా అభివృద్ధి కారిడార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న ఆఫ్రికా దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరాయి.  ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆఫ్రికా దేశాలు తమ ఆసక్తి ప్రదర్శించాయి.

 

 అందుకే ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ గనక పూర్తయితే, ఆఫ్రికాలో తన ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి ధారుణమైన ఎదురుదెబ్బ తగుల్తుందని చైనా భావిస్తోంది. అందుకే ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ లో చేరవద్దని తమ సిల్క్ రోడ్‌ లో చేరన్డంటూ భారత్, దక్షిణ ఆఫ్రికాలను డ్రాగన్ కోరుతోంది. భారత్‌ను ఒప్పించడం ద్వారా జపాన్‌పై పై చేయి సాధించాలని చైనా భావిస్తోంది. ఇందుకు బ్రిక్స్ సమావేశాలను వేదికగా మలుచు కుంటోంది. అందుకే ఎనలేని తన ప్రేమను కురిపిస్తూ "పాకిస్థాన్ పోషిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించటానికి సమాయత్తమైంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో స్వేచ్ఛా మార్కెట్‌ను ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం.

 

ఆఫ్రికా ఖండంలో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడం భారత్‌ తోపాటు ఆఫ్రికా దేశాలను తన దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తోంది చైన. బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌‌మెంట్ బ్యాంక్ ద్వారా ఆఫ్రికా దేశాలకు ఆర్థిక సాయం అందించాలని తద్వారా వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చైనా భావిస్తోంది.చైనాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనాలని ఈజిప్టు, గినియా దేశాలను చైనా ఆహ్వానించింది.

asia africa growth corridor map కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: