నివర్ తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. మూడు మండలాల్లో పర్యటించిన అధికారులు... నష్టంపై ఆరా తీశారు. అయితే కేంద్ర బృందం తమ గ్రామానికి రాకపోవడంపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల అభ్యంతరం లేవనెత్తారు. దీంతో మిగతా గ్రామాల్లో కూడా పర్యటించారు అధికారులు.

నివర్ తుఫాన్ గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం పర్యటించింది. చేబ్రోలు, పొన్నూరు, బాపట్ల మండలాల్లో అధికారుల పర్యటన సాగింది.  

కేంద్ర బృందం పర్యటనకు ముందు జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. పంటలు దెబ్బతిన్న తీరుతో పాటు  పాడైపోయిన రోడ్లపై ప్రజంటషన్ ఇచ్చారు అధికారులు. 30 మండలాల్లో 3 వేల 733 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్టు వివరించారు కలెక్టర్. కేవలం రోడ్ల మరమతుకే  కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలలో జరిగిన నష్టాన్ని కూడా ప్రజంటషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.     

పొన్నూరు నియెజకవర్గం పరిధిలో కేంద్ర బృందం పర్యటనను మాజీ ఎమ్మెల్యే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అడ్డుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పొన్నూరు మండలం వెల్లలూరులో కేంద్ర బృందం పర్యటించాల్సి ఉంది. అయితే అక్కడ బృందం ఆగకుండా వెళ్లడంపై నరేంద్ర నిరసన వ్యక్తం చేశారు. కాన్వాయ్‌కు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. దీంతో కారు దిగి వచ్చిన అధికారులకు... సమస్యను వివరించారు నరేంద్ర. వెల్లలూరులో కూడా పర్యటించి నష్టం గురించి తెలుసుకున్నారు.

బాపట్ల మండలంలో ఈతేరు, అప్పికట్లలో కూడా కేంద్రం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పంట నష్టం పై వివరించారు. రైతులతోను బృందం మాట్లాడింది. జిల్లాలో 90 వేల హెక్టార్లలో వరి, 37 వేల హెక్టార్లలో మిర్చి పంట దెబ్బ తిన్నాయని అథికారులు వివరించారు. రోడ్లు కూడా ఘోరంగా డెబ్బతిన్నాయన్నారు. కేంద్రం ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: