ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడే క్రమంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. రాజకీయంగా బలపడటం కోసం కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజల్లోకి బలంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గత కొన్ని రోజులుగా ఆయన వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇక తాజాగా సోము వీర్రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీలోకి వలసల జోరు కొనసాగుతుంది అని సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేసారు. టీడీపీ, వైసీపీకి చెందిన నేతలు బీజేపీలో చేరబోతున్నారు అని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని ఆయన కాస్త సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారు అని ఆయన అన్నారు. త్వరలోనే వారి పేర్లు వెల్లడిస్తాం అని ఆయన తెలిపారు. వైసీపి ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది అని ఆయన వివరించారు. భద్రాచలం తెలంగాణకు వెళ్లడం వల్ల రాయలసీమకు 200 టీఎంసీల నష్టం వాటిల్లింది అని ఆయన వివరించారు.

అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఏపీలో  ఉన్న పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయారు అని ఆయన మండిపడ్డారు. జాతీయ రహదారుల అనుసందానం చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని ఆయన మీడియాకు వివరించారు. వైసీపీ నేతలకు సిమెంట్ గనులు కావాలి కానీ సిమెంట్ పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయరా అని నిలదీశారు. రాష్ట్రంలో కుటుంబ వారసత్వ పాలన నడుస్తోంది అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని, ఎవరినో ముఖ్యమంత్రిని చెయ్యాలని బీజేపీ కోరుకోవడం లేదు అని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ నేతల్ని బెదిరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. నేను వస్తే అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడతారా??? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: