
కరోనా వైరస్ అనే ఒక వైరస్ ను సృష్టించి ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో లోకి నెట్టింది చైనా. అంతేకాదు కరోనా వైరస్కు తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పింది. అన్ని విషయాలు తెలిసినప్పటికీ ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో చైనా నుంచి పాకిపోయిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించి కోట్ల మందిని బలితీసుకుంది ఇక రూపాంతరం చెందుతూ ఎంతోమందిని బెంబేలెత్తిస్తోంది. చివరికి తిరిగి తిరిగి పుట్టింటికి వెళ్ళింది కరోనా. ఇక ఇటీవల కరోనా నుండి రూపాంతరం చెందిన డెల్టా చైనా ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
దీంతో ఇప్పటికే చైనాలోని దాదాపు చాలా కీలకమైన ప్రాంతాల్లో లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. చైనాలో 100% వాక్సినేషన్ పూర్తయ్యింది అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక డెల్టా వేరియంట్ చైనాను ఎంతలా భయపెడుతుంది అనే విషయానికి ఇక ఇటీవల చైనా తీసుకున్న నిర్ణయం నిదర్శనంగా మారింది. ఇటీవలే ఒక నౌకాశ్రయంలో ఒక కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది దీంతో ఇక చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ భారీ నౌకాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఒక కరోనా కేసు వచ్చినందుకే పరిస్థితి ఇలా ఉంటే ఒకవేళ వందల సంఖ్యలో కేసులు వస్తే ఇక చైనా ప్రభుత్వం వణికి పోతుందేమో అని విశ్లేషకులు అంటున్నారు చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై నగరం లోని ఒక పోర్టులో ఏకంగా వెయ్యి టన్నుల రవాణా చేసే నౌకాశ్రయాన్ని ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు వచ్చినందుకు ఇక చైనా ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేశారు.