ఏపీలో కొన్ని పరిణామాలు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా చేస్తున్నాయి. గత నెలలో ఏపీలో తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీలో ఇల్లు కూల్చివేత తర్వాత బయటకు వచ్చిన మాజీ వాలంటీర్ శివ శ్రీ... సోదరుడు అనిల్ కుమార్ అనుమానాస్పద మృతి చెందడం సంచలనం అయింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఆమె కలిసి కష్టాలు చెప్పుకున్న తర్వాత పోలీసులు విచారణ పేరుతో ఆమెను వేధించారు అనే ఆరోపణ టీడీపీ నుంచి ఎక్కువగా వినపడింది.

సీఎం జగన్ ఇంటి సమీపం లో అమరరెడ్డి నగర్ కాలనీ వాసులు ఇళ్ల కోసం పోరాడిన శివశ్రీని పోలీసులు కావాలనే వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న శివశ్రీకి అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయనే ఆరోపణలు వినిపించాయి. జనసేన అధినేత పవన్ కలిసిన  నాటి నుండి తమకు కష్టాలు, వేధింపులు మొదలయ్యాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని శివశ్రీ వీడియో కూడా చేసారు.

ఇంతలో తన సోదరుడు గుంటూరు జిల్లా తక్కెళ్ల పాడు లో మృతి చెందారని వెంకటేశ్వరవు అనే వ్యక్తి ఆటోలో తీసుకువచ్చాడు. రోడ్ పై పడిపోయి ఉన్నాడని, తక్కెళ్ళ పాడులో చూసాను అని ఆటో డ్రైవర్ పేర్కొన్నాడు. తన సోదరుడు దుస్తులు తడిసి ఉండడం ఆటో లో చిన్న సిరేంజి బాటిల్ లాంటి వస్తువు ఉండడం పై శివ శ్రీ అనుమానం వ్యక్తం చేసారు. తన సోదరుడుకి ఎలాంటి గాయాలు లేకపోయినా ముక్కు చెవులు నుండి రక్తం కారిందని ఆమె పేర్కొంది. పోస్ట్ మార్టం నిమిత్తం తన సోదరుని మృతదేహాన్ని అద్దరాత్రి  ఎన్ ఆర్ ఐ ఆస్పత్రికి తరలించారని ఆమె పేర్కొంది. తన బిడ్డ అనిల్ కుమార్ ను ఎవరో పొట్టనబెట్టుకున్నారు  అని శివశ్రీ తల్లీ బోరున విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: