ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టిడిపి, బిజేపి పార్టీ పై ఫైర్ అయ్యారు.  రాజకీయ లబ్ది పొందాలనే కుట్రతో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని.. సోము వీర్రాజు ఏనాడైనా మత్స్యకారుల గురించి మాట్లాడారా ? అని  ఫైర్ అయ్యారు.  సోము వీర్రాజు రాసిన లేఖ ..చంద్రబాబు ఆఫీస్ లో తయారైందని.. టీడీపీ , బీజేపీల మధ్య తెరచాటు బంధం కొనసాగుతూనే ఉందన్నారు.. చంద్రబాబు ఎలా చెబితే వీర్రాజు అలా డ్రామాలాడుతున్నారని.. సోమువీర్రాజు సీఎం జగన్ కు మత్స్యకారుల గురించి లేఖ రాయడం 8వ వింత అని ఎద్దేవా చేశారు  మంత్రి సీదిరి అప్పలరాజు .  

ఏపీకి ప్రత్యేకహోదా కావాలని సోమువీర్రాజు జీవితంలో ఒక్కసారైనా లేఖ రాశారా ?  రాష్ర విభజన హామీల పై సోమువీర్రాజు ఎందుకు కేంద్రానికి లేఖలు రాయలేదని నిలదీశారు  మంత్రి సీదిరి అప్పల రాజు .  చంద్రబాబు చెబితే నేర్చుకునే స్థితిలో సీఎం జగన్ లేరని.. 217 జీవో నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితమన్నారు.  కేవలం 27 ఎంఐ ట్యాంకులకు సంబంధించిన జీవో మాత్రమేనని.. చంద్రబాబు ఏదో రకంగా మత్స్యకారులను  రెచ్చగొట్టాలనుకుంటున్నారని నిప్పులు చెరిగారు.  పైలట్ ప్రాజెక్టు పై మత్స్యకారులు ఆందోళన చెందనవసరం లేదని.. చంద్రబాబు మత్స్యకారులకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు  మంత్రి సీదిరి అప్పలరాజు  .   

వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారులకు 10 లక్షలు మేం ఇస్తున్నామని.. ప్రతీ సెక్రటేరియట్ పరిధిలో మినీ చేపల రిటైల్ దుకాణం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.   మత్స్యకారులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని.. తీరప్రాంతంలో ప్రతీ మత్స్యకారుడికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు.  మటన్ మార్టులు పెడితే ఎలా ఉంటుందనేది మేం శాఖా పరంగా చర్చిస్తున్నామని.. ఈ ప్రతిపాదనలు ఇంకా సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని వెల్లడించారు.  మటన్ మార్టుల ఏర్పాటు పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు  మంత్రి సీదిరి అప్పలరాజు .

మరింత సమాచారం తెలుసుకోండి: