ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ  ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు  రెండున్న‌రే ళ్లు పూర్త‌య్యింది. ఇక ఇటీవ‌లే స్థానిక ఎన్నిక‌లు, ఎంపీటీసీ, జ‌డ్పీ టీసీ ఎన్నిక‌లు కూడా ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పటికిప్పుడు కుప్పంలో ఎన్నికలు జరిపితే చంద్రబాబుకి డిపాజిట్లు వస్తాయో రావో అన్న‌ది పెద్ద డైల‌మాలోనే ఉంది. ఎందుకంటే స‌ర్పంచ్ ఎన్నిక‌లు, ఎంపీ టీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబుకు చావు దెబ్బ త‌గిలింది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు కుప్పం ను కంచుకోట‌గా నిల‌బెట్టు కుంటోన్న చంద్ర‌బాబుకు ఈ స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ ప్ర‌జ‌లు మామూలు షాక్ ఇవ్వ‌లేదు. చివ‌ర‌కు చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారి ప‌ల్లె ఎంపీటీసీ ని కూడా వైసీపీ బంప‌ర్ మెజార్టీతో ద‌క్కించు కుంది.

ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు కుప్పంలో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు మ‌రోసారి కుప్పంలో పోటీ చేస్తారా ? అంటే పార్టీ వ‌ర్గాల్లోనే చాలా మంది డౌట్ అంటున్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో చంద్ర‌బాబు కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలో లేదా, విశాఖ నలుదిక్కుల్లో ఓ చోట పోటీకి దిగుతారనే ప్రచారం పార్టీ వ‌ర్గాల్లో ఉంది. కుప్పంతో పాటు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం.. ఇలా రెండు నియోజకవర్గాల్లో బాబు పోటీ చేస్తారని టాక్ ?

గ‌తంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేవారు. అయితే అది ఆయ‌న ద‌మ్మేంటో చూపించేందుకు అన్ని ప్రాంతాల నుంచి పోటీ చేసేవారు. కానీ ఇప్పుడు చంద్ర‌బాబు కుప్పంలో ప‌రిస్థితి బ్యాడ్ గా ఉండ‌డంతో మ‌రో నియోజ‌క‌వ‌ర్గం చూసుకోవాల్సిన దుస్థితి త‌లెత్తింది. అందుకే విశాఖ లో గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ నాలుగు సీట్లు గెల‌వ‌డంతో ఈ సారి అక్క‌డ నుంచి కూడా పోటీ చేస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: