తమ సిబ్బంది  పై మితిమీరిన జోక్యం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ కు విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పిఐఏ) ప్రకటించింది. ఇకపై ఇస్లామాబాద్ నుండి కాబూల్ కు విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు తెలియజేసింది. సాధారణంగా భీమా సంస్థలు ప్రమాదాలు జరిగే లేదా యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాలకు విమానాలను  నడపాలంటే సాధ్యమైనంత ఎక్కువ భీమా ప్రీమియం వసూలు చేస్తారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధ వాతావరం కనిపిస్తున్నందున ప్రపంచంలో ఏదేశము కూడా ఆఫ్ఘనిస్తాన్ కు విమానాలను నడపడానికి ఇష్టపడడం లేదు. అంతే కాకుండా విమాన సర్వీసులను నిలిపివేశారు కూడా. ప్రస్తుతం పిఐఏ మాత్రమే సాహసోపేతంగా విమానాలను కాబూల్ కు నడుపుతోంది. గతం లో కాబూల్ నుండి ఇస్లామాబాద్ కు టికెట్ ధర 100  నుండి 150 డాలర్లు ఉండగా పాకిస్తాన్ ఈ రేటు ను 12500  డాలర్లకు పెంచింది. 




అయితే ఈ విషయమై ఆఫ్ఘనిస్తాన్  పిఐఏ ని ధరలు విషయమై హెచ్చరించింది కూడా. పిఐఏ ఎంతమాత్రం ధరలను తగ్గించకపోవడంతో   పిఐఏ  అనుమతులకు కొర్రీలు పెట్టడం, పిఐఏ సిబ్బంది ని భయ పెట్టడం  ఇలా ఆఫ్ఘనిస్తాన్ మితిమీరిన జోక్యంతో పిఐఏ ను ఇబ్బందులు పెట్టడం లాంటి వి చేస్తోంది . ఈ కారణంగా పాకిస్తాన్ కాబూల్ కు విమాన సర్వీసు లను నిలిపివేస్తున్నట్లు 'కామ్ ఎయిర్' కు తెలిపింది. అయితే కామ్ ఎయిర్ మాత్రం ఈ విషయమై ఎక్కడా కూడా స్పందించలేదు. ఇరు ఎయిర్ లైన్స్ లనుండి తమ వాదన సరిగానే ఉన్న సామాన్యుడికి భారం పడుతుండడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇలా చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని కూడా బెదిరించి ఉండకూడని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ లో నిత్యం బాంబ్ పేలుళ్ల తో దద్దరిల్లుతున్నా ఆదేశం లోకి వలదారులు వెళ్లేందుకు సంకోసించడం లేదు. అయితే భూ మార్గం నుండి రావాలంటే అధిక దూరం ప్రయాణం చేయవలసి ఉండడంతో ప్రజలు విమాన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: