ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు.  చిన్న పాటి నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలను తీస్తుంది. అయితే రోడ్డు నిబంధనలు పాటించాలని.. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలి అంటూ అటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి  తీరు మార్చే విధంగా భారీగా జరిమానాలు కూడా విధిస్తూ ఉండడం గమనార్హం. అయితే అటు ట్రాఫిక్ పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 రోజు రోజుకి రోడ్డు నిబంధనలు పాటించకుండా రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఇంకా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి తీసుకు వస్తున్నాయి. ముఖ్యంగా  రాంగ్ రూట్ లో  వెళ్లడం కారణంగా ఇటీవలి కాలంలో ఎన్నో దారుణమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్లడమే ఏకంగా ఒకరి ప్రాణం తీసింది.


 ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఘోరమైన ఆక్సిడెంట్ కు సంబంధించిన వీడియో కాస్త త్వరగా మారిపోయింది. మహారాష్ట్ర పూణేలోని చించావాడ లో వాహనదారుల  చిన్న పాటి నిర్లక్ష్యం ఏకంగా ప్రాణాలు పోవడానికి కారణం అయింది. కారు బైక్ రాంగ్ రూట్లో వెళుతుంది. ఈ క్రమంలోనే కారును ఓవర్టేక్ చేసేందుకు బైక్ ప్రయత్నించగా కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసాడు. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కూడా డోర్ తగిలి కింద పడిపోయారు. ఇక అటు వెంటనే అటునుంచి పెద్ద లారీ రావడంతో లారీ  కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: