విశాఖ స్టీల్ ప్లాంట్. ఘనమైన ప్లాంట్. బంగారం లాంటి ప్లాంట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీకి గర్వమైన ప్లాంట్. ఎందరో అమరులై సాధించిన గొప్ప కర్మాగారం. అలాంటి ప్లాంట్ ఇపుడు ప్రైవేట్ బాటన పడుతోంది. దాని నుంచి కాపాడేవారు లేరా అని ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

మరో వైపు రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదు, ప్రజాభిప్రాయన్ని కూడగట్టి గట్టి ఉద్యమం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దాంతో కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. లేటెస్ట్ గా విశాఖ ప్లాంట్ కోని అతి ముఖ్యమైన విభాగంగా ఉన్న‌ కోకో ఒవెన్ బ్యాటరీని ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలిచారు.

దాంతో ప్లాంట్ ఫ్యూచర్ ఏంటో తెలిసిపోయింది అంటున్నారు. ఎందుకంటే ప్లాంట్ మొత్తానికి అతి ముఖ్యమైన విభాగం ఇది. ఇక్కడ నుంచే గ్యాస్, కరెంట్ సహా అనేక రకాలైన ఉత్పత్తులు జరుగుతాయి. ప్రస్తుతం ఈ విభాగంలో రెండు వేల మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో మూడు వేల మందికి ఉపాధి కల్పించే స్తోమత ఉంది. అలాగే  బ్యాటరీ విభాగాన్ని విస్తరించాలని కూడా ఆలోచిస్తున్న వేళ సడెన్ గా ప్రైవేట్ పరం చేయడం అంటే ప్లాంట్ రూట్ ఏంటో తెలిసిపోయినట్లే అంటున్నారు.

కేంద్రం మెల్లగా ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేసి ఏదో నాడు స్టీల్ ప్లాంట్ మనది కాదు అనేస్తుంది అని కార్మిక సంఘాలు భయపడుతున్నాయి. మొత్తానికి చూస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతోంది కానీ కేంద్రానికి ఏ మాత్రం కదలిక తీసుకురాలేకపోయింది అన్నది నిష్టుర సత్యంగానే చూడాలి. మరో వైపు ప్రజలు కూడా ప్లాంట్ విషయంలో పోరాటాలకు సిద్ధపడకపోవడం కూడా ఆలోచించాల్సిన విషయంగానే చూడాలి అంటున్నారు. ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం మారదు అన్నదే నిజమని తేలిపోతోంది.








మరింత సమాచారం తెలుసుకోండి: