జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే అన్ని విషయాల్లోనూ భిన్నంగానే ఉంటోంది. ఏపీ కొత్త రాష్ట్రం. విభజన గాయాలు అలాగే ఉన్నాయి. ఇక చంద్రబాబు ముందు అయిదేళ్ళు పాలించి తన‌దైన మార్క్ పాలన చేసి వెళ్లారు. దాంతో జగన్ చుట్టూ వత్తిళ్లూ, పోలికలు, కూడికలూ, మైనస్సులూ ఎన్నో ఉన్నాయి.

ఇదిలా ఉంటే కేవలం వంద కోట్లు మాత్రమే ఖజనాలో ఉంచి టీడీపీ దిగిపోయింది. దాంతో కొత్త ప్రభుత్వం ఎలా పాలన చేయాలి అన్నదే పెద్ద చర్చగా నాడు ఉంది. అలాంటి సర్కార్ ని ఏకంగా రెండున్నరేళ్ల పాటు జగన్ నడిపించారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అదే టైమ్ లో అప్పులు కుప్పలుగా చేస్తున్నారు అంటే చేయకతప్పని పరిస్థితి ఏపీలో ఉంది. రెండు సార్లు కరోనా వచ్చి ఏపీని ఇబ్బందుల పాలు చేసింది. ఉన్న ఆదాయాలు పడిపోయాయి. దాంతో కొత్త మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఓటీఎస్ అంటూ ఒక పధకాన్ని తెచ్చింది దీనివల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆశిస్తోంది.

అయితే ఇది విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. అదే టైమ్ లో ఓటీఎస్ కి ఎంత మంది మద్దతు ఇస్తారు అన్నది కూడా చర్చగానే ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జగన్నన కాలనీలకు స్థలం అంటూ ఏపీలో బిల్డర్లు,  రియల్టర్లు వేసే హౌసింగ్ ప్రాజెక్టులలో అయిదు శాతం మేర స్థలాన్ని కానీ దానికి సరిపడ మొత్తానికి కానీ ప్రభుత్వానికి చెల్లించమంటూ కొత్తగా ఉత్తర్వులను జారీ చేశారు.

దీని వల్ల కూడా ఆదాయం వస్తుందని జగన్ ప్రభుత్వం గుర్తించడమే కొత్త ఆలోచన అంటున్నారు. ఇపుడు ఆదాయ మార్గాల విషయంలో ఇతర రాష్ట్ర  ప్రభుత్వాలు కొన్నింటికి మాత్రమే అనుసరిస్తున్నాయి. అయితే ఏపీలో ఖజానా నింపడానికి ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరిస్తోంది.దాంతో పాటు ఎప్పటికపుడు వినూత్నమైన  ఆలోచనలు చేస్తోంది. దీని వల్ల ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు వస్తాయన్నది పక్కన పెడితే ఇన్ని రకాలుగా ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని మేధావులు సైతం విశ్లేషించుకునే సీన్ ఉందిపుడు ఏపీలో.


మరింత సమాచారం తెలుసుకోండి: