
రాజకీయంగా జనసేన పార్టీ అలాగే భారతీయ జనతాపార్టీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యవహారాల మీద కాస్త సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంత్రులను రెండు పార్టీలు టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న మంత్రులు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విషయంలో వెనకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
అందుకే వచ్చే ఏడాది మొదట్లో ఖచ్చితంగా ముగ్గురు మంత్రులను గోదావరి జిల్లాల నుంచి జగన్ తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎవరు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకు రాలేకపోతున్నారు అలాగే విపక్షాల మీద విమర్శలు చేయలేక పోతున్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన సీరియస్ గా పెట్టే అవకాశం ఉందని ప్రజల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎంపీ లతో సఖ్యత లేకుండా ఉన్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకుండా ఆయన ఊరుకునే అవకాశమే లేదని అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.