బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ. ఒకసారి కాదు, మూడు సార్లు గెలిచి మరీ ఈ గడ్డ నాదీ అని గట్టిగా చాటిచెప్పింది. మొదటి రెండూ ఎలా ఉన్నా మూడవసారి మాత్రం ఆమె బలమైన మోడీ సర్కార్ తో తలపడి గెలిచింది.

ఆ తరువాత మమత ఏకంగా తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీగా చేసుకుని కాబోయే ప్రధాని తానే అని రీ సౌండ్ చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేక కూటమికి ఏర్పాటు చేయడానికి మమత చూస్తున్నారు.

ఇక ప్రాంతీయ పార్టీల కంటే తాను ఎత్తున ఉండాలన్న ఉదేశ్యంతో ఆమె కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న వారిని నేరుగా తన పార్టీలో చేర్చుకుంటున్నారు. గోవాతో చూసుకున్న ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకున్నా కాంగ్రెస్ నే మమత ఆకర్షిస్తోంది.

మమతా బెనర్జీ దూకుడుతో కాంగ్రెస్ కి కొంత ఇబ్బంది గానే ఉంది. కాంగ్రెస్ లో ఇపుడు  ఒక సందిగ్ద పరిస్థితి ఉంది. ఉన్న వారు పార్టీలో సాగుతున్న పరిణామల పట్ల హ్యపీగా లేరు. అదే టైమ్ లో నేరుగా బీజేపీలోకి వెళ్ళిపోలేరు. అలాంటి వారికి మమత ఒక ఆల్టర్నేటివ్ గా ఉంది అంటున్నారు.

అయితే మమత తాను బీజేపీకి అసలైన ప్రత్యర్ధిని అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ తో ఆడుతున్న గేమ్ చివరికి వికటించి బీజేపీకే మేలు చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. బీజేపీకి కావాల్సింది అదే. మమత ఎంత ఆకర్షించినా కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ తినదు, అదే టైమ్ లో బాగా  బలహీనపడుతుంది. అలా కాంగ్రెస్ కావడమే బీజేపీకి ఇపుడు అవసరం. అందువల్ల మమత చేస్తున్న ఈ ప్రయత్నాలు బీజేపీని మరోమారు కేంద్రంలో అధికారంలోకి తీసుకు వస్తే ఆ తప్పు ఎవరిది అన్నదే ప్రశ్న. జవాబు తెలిసిందే. మరి దీనిని బట్టి సర్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందో అర్ధం చేసుకోవాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: