తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సరే రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఏ విధంగా కూడా పార్టీ కోసం కష్టపడే ప్రయత్నం చేయడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం రేవంత్ రెడ్డి మధ్య కాలంలో ఏ కార్యక్రమం నిర్వహించిన సరే దానికి సంబంధించి ప్రజల్లో గానీ పార్టీ కార్యకర్తల గాని ఎటువంటి స్పందన రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉత్సాహంగా పని చేయకపోవడం కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన అంశం. ఇక రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో సోనియాగాంధీ చాలా సీరియస్ గా ఉన్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సరే రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పాదయాత్ర కు సంబంధించి కార్యకర్తల్లో ఎటువంటి స్పష్టత లేకపోవడం కాస్త సోనియాగాంధీని ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.

పార్టీకి సంబంధించి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొనక పోవడం పట్ల ఇబ్బందికర వాతావరణం నెలకొంది. వీటితో సోనియాగాంధీ బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీద పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారని అయితే పార్టీలోని సీనియర్ నాయకులు కారణంగానే తాను పాదయాత్ర కు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నామని చాలా మంది సీనియర్ నాయకులు తమ తమ జిల్లాలో పాదయాత్ర వద్దని తన మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాదయాత్ర ను ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: