నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు జనసేన నేతలకు లక్కీ ఛాన్స్ దొరికేలా ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు...లేకపోయినా సరే కొందరికి మంచి ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు దక్కుతాయి. ఇక సీట్లని దక్కించుకోవడానికి చాలమంది నేతలు ట్రై చేస్తారు. కానీ సీటు ఎవరికి దక్కుతుందనేది చెప్పలేం. కాకపోతే గత ఎన్నికల్లో మంచిగా ఓట్లు తెచ్చుకున్న జనసేన నేతలకు మాత్రం లక్కీ ఛాన్స్ ఉంటుందనే చెప్పొచ్చు. అది కూడా గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నేతలకు సీటు కన్ఫామ్ అనే చెప్పాలి.

సీటు వచ్చిన నేతలకు గెలుపు కూడా పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ సీట్లలో టీడీపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి...జనసేన నేతలకు దాదాపు గెలవడం సులువు అవుతుంది. ఒకవేళ టీడీపీతో గానీ పొత్తు లేకపోతే జనసేన నేతలకు సీట్ల విషయంలో ఎలాంటి డౌట్ ఉండకపోవచ్చు...కానీ గెలుపు విషయంలో మాత్రం డౌట్ ఉంటుందనే చెప్పొచ్చు. టీడీపీ-వైసీపీల మధ్య జనసేన గెలవడం అంత సులువు కాదు...కానీ కొందరు నేతలకు మంచి అవకాశాలు ఉన్నాయి.

అది కూడా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నాయకులకే. ఉదాహరణకు గత ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ దాదాపు 50 వేల ఓట్లు తెచ్చుకుని సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. కేవలం వైసీపీపై 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. నెక్స్ట్ ఈయనకు టీడీపీతో పొత్తు లేకపోయిన అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అటు రాజోలు సీటు జనసేన ఖాతాలో పడిన విషయం తెలిసిందే. జనసేన తరుపున గెలిచిన రాపాక వరప్రసాద్...వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయినా సరే రాజోలులో జనసేన తరుపున నిలబడే నాయకుడుకు లక్కీ ఛాన్స్ ఉంటుంది. అలాగే అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కూడా జనసేన నేతలకు సొంతంగా గెలిచే బలం ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: