స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా లోకేశ్ ఇప్పుడు క‌నిపించినా, ఆయ‌న ఒక‌ప్పుడు జ‌ల్సాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రేంజ్ లో ఉండేవార‌ని మ‌నం మ‌రిచిపోకూడ‌దు.ఆ రోజు స‌చివాల‌యంలో ఆడిందే ఆట,పాడిందే పాట అన్న విధంగా అయ్య‌గారి ఆదేశాలు నెగ్గాయి.చేష్ట‌లు నెగ్గాయి.కానీ ఇప్పుడు అలా లేదు.ఉండదు కూడా!దీంతో మంత్రిగా ఎలా ఉన్నారో అన్న‌ది ఆ వేళ సంగ‌తి అటుంచితే పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో అందుకునేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్నారా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న.కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు కాస్త బాగానే ఉన్నా,కొన్ని చోట్ల ఇప్ప‌టికీ ఆయ‌న చతికిల‌ప‌డుతూనే ఉన్నారు.క‌నుక లోకేశానికి తొంద‌రెక్కువ అన్న సెటైర్ కూడా టీడీపీలోనే ఉంది.దీనిని ఆయ‌న ఎలా దాటుతారో అన్న‌దే ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.


పార్టీ బ‌తికి మంచి ఫ‌లితాలు సాధించాల‌ని ఎవ‌రికి ఉండదు.పార్టీని నాలుగు కాలాల పాటూ న‌లుగురి మ‌ధ్య ఉంచాల‌ని ఎవ‌రికి ఉండ‌దు.అనుకుంటాం కానీ టీడీపీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిలేదు.లేక‌నే చ‌తికిల‌ప‌డుతోంది.మాట్లాడే శ‌క్తి, పోరాడే శ‌క్తి అన్న‌వి అస్స‌లు లేవు.వీటి కార‌ణంగా అతి పెద్ద ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీని అస్స‌లు ట‌చ్ కూడా చేయ‌లేక‌పోతోంది.ఒక‌ప్పుడు టీడీపీ నేత‌లు జ‌గ‌న్ కు చుక్క‌లు చూపించారు.క్షోభ పెట్టారు.అవ‌మానించారు.కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ కావ‌డంతో చాలా మంది టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ చెంత‌కు చేరి బాబుపై రాళ్లు విసురుతున్నారు.కొడాలి నాని, వంశీ తిట్టే బూతుల‌కు క‌నీసం కౌంట‌ర్ ఇచ్చే స్థాయిలో కూడా ఇవాళ టీడీపీ నాయ‌కులు లేరు.ఇచ్చినా కూడా అవ‌న్నీ నోటి తుంప‌ర్లకే కానీ పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వ పెద్ద‌ల పెత్త‌నాన్ని,ఆధిప‌త్యాన్ని నిలువ‌రించేవే కావు.


ఎవ‌రెన్ని మాట్లాడుకున్నా తెలుగుదేశం పార్టీ ఇవాళ సంక్షోభంలో ఉంది. ఏం చేసినా కూడా క‌లిసిరాని స్థితిలో కూడా ఉంది. ఉద్య‌మాలు చేప‌ట్ట‌లేక,చేప‌ట్టినా ప్ర‌భుత్వ అణిచివేత‌ల కార‌ణంగా ముంద‌డుగు వేయ‌లేక అవ‌స్థ ప‌డుతోంది.ఈ నేప‌థ్యంలో పార్టీకి మ‌నుగ‌డ ద‌క్కాలన్నా, రేప‌టి వేళ మంచి ఫ‌లితాలు అందుకోవాల‌న్నా కూడా లోకేశ్ కానీ మ‌రొక‌రు కానీ అందుకు ఏ త‌ర‌హా ప్ర‌ణాళిక వేస్తార‌న్న‌దే ముఖ్యం. కానీ ఇప్పుడున్న స్థితిలో లోకేశ్ పార్టీకి పెద్ద‌గా ప్ల‌స్ కాడ‌ని కొంద‌రు అంటున్నారు.పార్టీ విప‌క్షంలో ఉంది క‌నుక ఆ మాత్రం అయినా నాయ‌కులు ఆయ‌న మాట వింటున్నారు కానీ రేప‌టి వేళ అధికారంలోకి వ‌స్తే అన్నింటా చిన‌బాబు మాట‌కు అంత సీన్ ఉండ‌ద‌ని కొంద‌రు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: