కరోనా ఆనందయ్య.. మరలా మరలా వార్తల్లోకి వస్తున్నారు. కొత్త సంవత్సరం ఆయన గురించి, ఆయన ప్రణాళికల గురించి కొత్త కొత్త వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజా గా వస్తున్న వార్తలు మాత్రం ఆయన కోవిడ్-19 మందుకు సంబంధించి కాదు... మరి దేనిగురించి ?
ఆనందయ్య ఇటీవల కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కారు. కొంత కాలానికి ఆ విషయం మరుగున పడిపోయింది. నూతన ఏడాది  సంవత్సరం సందర్భంగా ఆయన మరలా వార్తల్లోకి ఎక్కారు. అయితే  ఆయన ఈ సారి సామాజిక మాద్యమాల ద్వారా వెలుగులోకి వచ్చారు. కొత్త సంవత్సరంలో ఆయన  తన సామాజిక వర్గనేతలతో సమావేశంఅయ్యారన్నది ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ఆయన  సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు ఒక స్వతంత్య్ర సంస్థ తో సర్వే నిర్వహించారని తెలిసింది.  నియోజక వర్గాలవారీగా తమ కులానికి చెందిన ఓటర్ల సంఖ్య, ప్రజలను ప్రభావితం చేయగల నేతలు ఎవరు? ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడతాయి... ఇత్యాది విషయాలను ఆ సంస్థ లెక్కించి ఇచ్చినట్లు సమాచారం.  ప్రస్తుతం కాపు కులస్తులందరూ ప్రత్యేకంగా సమావేశంకావడంతో తమ కులానికి చెందిన నేతలు కూడా సమావేశం కావాలని ఆనందయ్య సామాజిక వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఆనందయ్య ఉచిత కరోనా మందు పంపిణీ ద్వారా తెలుగు ప్రజలకు చాలా దగ్గర అయ్యారని, దీనిని రాజకీయంగా మార్చుకుంటే  బిసి వర్గాలకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు రాజకీయపార్టీల నేతలు ఆనందయ్యతో టచ్ ఉన్నారని, పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్నికలకు వనరులు సమకూరుస్తామని హామి ఇచ్చినట్లు గా కూడా  ఆయన అనుచర గణం బహిరంగంగానే పేర్కోంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు మేధావులు మాత్రం ఆనందయ్యను  ఆచితూచి అడుగులు వేయమని చెప్పినట్లు సమాచారం. వివిధ రాజకీయ పక్షాలు వారి స్వార్థం కోసం వాడుకుంటాయని, ఇప్పుడు ముందు నడవమని చెబుతున్న వారంతా ఎన్నికల వేళ  దూరంగా ఉంటారని  సలహా ఇచ్చినట్లు  తెలిసింది. ఏది ఏమైనా ఆనందయ్య అడుగులు ఎటువైపు అనే విషయమై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: