వినటానికే భయంగా ఉంది. అదృష్టవంతుడు కాబట్టే నరేంద్రమోడి సేఫ్ గా ఉన్నారు. మామూలుగా మన మంత్రులు వెళుతుంటేనే అడ్వాన్స్ పార్టీ అని తర్వాత పైలెట్ అని ముందు వెహికల్స్ వెళతాయి. ముందు వెళ్ళిన వెహికల్స్ రూట్ క్లియర్ చేస్తుంటే వెనకాల మంత్రి కారు ఫాలో అవుతుంది. ముందు ఎక్కడైనా సమస్యుందని అడ్వాన్స్ పార్టీ గమనించిన వెంటనే అదే విషయాన్ని పైలెట్ వెహికల్ కు చెబుతుంది. ఆ విషయాన్ని వెంటనే మంత్రి సెక్యూరిటికి చెబుతారు. పరిస్ధితిని బట్టి వెంటనే మంత్రి కారును వేరే రూటులోకి మళ్ళించేస్తారు.




ఒక మంత్రి వెళ్ళేదారిలోనే ఇంత సెక్యురిటీ చెక్ ఉన్నపుడు ముఖ్యమంత్రి వెళ్ళే కాన్వాయ్ సెక్యూరిటి ఇంకెంత పకడ్బందీగా ఉంటుంది. సీఎం సెక్యూరిటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నపుడు ఇక ప్రధానమంత్రి వెళ్ళే దారిలో సెక్యూరిటి ఎలాగుండాలి ? కానీ ప్రధాని సెక్యూరిటిలోని డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. దాంతో ప్రధానమంత్రి సెక్యూరిటి మరీ ఇంత వీకా అంటు యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. ఇక్కడ ప్రధాని ఎవరు, ఏ రాష్ట్రంలో పర్యటించారు ? రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది ? అనేది ముఖ్యంకాదు.  సెక్యూరీటి ప్రోటోకాల్లో ఉన్న లోపాలే ముఖ్యం.




ఇంతకీ విషయం ఏమిటంటే పంజాబ్ లోని హుస్సేనీవాలాలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్ధూపం దగ్గరకు నరేంద్రమోడి వెళ్ళాలి. అందుకోసమని ముందుగా బఠిండా చేరుకున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్లో ప్రయాణించేందుకు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఇదే విషయాన్ని పంజాబ్ డీజీపీకి కేంద్ర హోంశాఖ, ఎస్పీజీ ఉన్నతాధికారులు చెప్పారు. రోడ్డు క్లియరెన్స్ కూడా వచ్చింది. బఠిండా నుండి హుస్సేనీవాల కు 2 గంటల ప్రయాణం. సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లైఓవర్ దగ్గరకు ప్రధాని కాన్వాయ్ చేరుకోగానే సమస్య ఎదురైంది.




ఫ్లైఓవర్ మీద రైతులు కొన్ని వాహనాలను అడ్డుపెట్టేశారు. దాంతో కాన్వాయ్ వెళ్ళలేకపోయింది. 20 నిముషాలు వెయిట్ చేసినా ఉపయోగం లేకపోవటంతో ప్రధాని ప్రోగ్రామ్ రద్దు చేసుకుని వెనక్కు వెళ్ళిపోయారు. పైకి చాలా చిన్న విషయంగా కనబడుతుంది కానీ చాలా లోతైన విషయం.  ప్రధాని వాహనం ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునే ముందే కనీసం కాన్వాయ్ లో 30 వాహనాలు ఫ్లైఓవర్ మీదకు వెళ్ళాలి. మరవన్నీ ఫ్లైఓవర్ దాటుకుని  ఎలా వెళ్లగలిగాయి. వాటికి ఫ్లైఓవర్ మీద వాహనాలు అడ్డురాలేదా ? అన్నదే ఆశ్చర్యంగా ఉంది.




ఇక్కడ సమస్య ఏమిటంటే అసలు ఫ్లైవర్ మీదకు రైతులు వాహనాలను ఎలా తీసుకెళ్ళగలిగారు. ప్రధాని వస్తున్న రోడ్డు క్లియరెన్స్ ఎవరు చూశారు. ప్రధాని ప్రయాణంచేసే రోడ్డుమీద రెండువైపులా ఫుల్లు సెక్యూరిటి ఉంటుంది. ప్రదాని కాన్వాయ్ వచ్చే ముందు తర్వాత కనీసం అర్ధగంట పాటు ఏ వాహనాన్ని రోడ్డు మీదకు పోలీసులు రానీయరు. అడ్వాన్స్ సెక్యురిటి పార్టీలు, పైలెట్ పార్టీలన్నీ ఏమయ్యాయి ? ముందు అవి రూట్ క్లియర్ చేసుకుని వెళుతుంటేనే కదా వెనక ప్రధాని కాన్వాయ్ వచ్చేది ?




మరి ముందు అడ్వాన్స్ పార్టీలు, పైలెట్ వాహనాలు వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైఓవర్ మీదకు రైతులు వాహనాలను ఎలా తీసుకెళ్ళగలిగారు ? ఇక్కడే సెక్యూరిటి లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.  ఫ్లైఓవర్ మీద ప్రధాని 20 నిముషాలు ఆగిపోయినా ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. రైతుల ముసుగులో ఇంకెవరైనా ఏమైనా చేసుంటే పరిస్ధితేంటి ? భధ్రతను చూస్తున్న ఎస్పీజీ, కమేండోలు ఫ్లైఓవర్ మీద ప్రధానిని ఏ విధంగా కాపాడేవారు ? ప్రధాని సెక్యూరిటిలో లోపాలు చూస్తుంటే ఏదో సినిమాలో సన్నివేశంలాగుంది. ఇపుడు బాధ్యత మీదంటే మీదని తోసేసుకోవటం కాదు.  భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: