టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించారు. 2024 లోక్ సభ ఎన్నికలలో అధికారం నుంచి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపడం పై కేసీఆర్ తన శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. జాతీయ రాజకీయాలపైనే ఆయన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ పై దాడి చేయడానికి జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలు, రాజకీయ ఎత్తుగడలతో జాతీయ దృష్టి ని ఎలా ఆకర్షించాలనే దానిపై తనకు మార్గని ర్దేశనం చేయడానికి కేసీఆర్ ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

 జాతీయ రాజకీయాల్లో తనకు సహకారం అందించేందుకు ప్రత్యేకంగా నేషనల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని కేసిఆర్ ఇప్పుడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టు లతో పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వివిధ సంఘాల నేతలు, టిఆర్ఎస్ లోని మరికొందరు సీనియర్ నేతలను ఆయన తన జాతీయ జట్టు కోసం పరిశీలించినట్లు సమాచారం. ఈ బృందంలో మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కీలకంగా ఉంటారని టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కేసీఆర్ తన కూతురు కవిత మాదిరిగానే హరీష్ రావు ను కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొని, ఢిల్లీ స్థాయిలో దూకుడు చూపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో తెరాస శక్తిగా హరీష్ రావు ఉంటారని అంటున్నారు.

జాతీయ రాజకీయాలకు అవసరమైన సత్తా హరీష్ రావు కు ఉందని కెసిఆర్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ లను కలిసేందుకు ఇటీవల తన కూతురు కవిత ను ముంబై టూర్ కు తీసుకువెళ్లిన కేసీఆర్ కవితను జాతీయ రాజకీయాల్లో కీలకంగా పరిమితం చేయాలనుకుంటున్నానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు హరీష్ కి కూడా కొత్త బాధ్యతలు ఇచ్చి అతని దూకుడుతో తెరాసని ఢిల్లీలో ప్రత్యేకంగా నిలపాలనేది కెసిఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: