తెలుగుదేశంపార్టీలో పరిస్ధితులు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధినేత చంద్రబాబునాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. కానీ అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళేమో వాళ్ళలో వాళ్ళు తగువులాడుకుంటున్నారు. జిల్లాలో జేసీ బ్రదర్స్ ఒక్కళ్ళు  చాలు మొత్తం కంపు చేసేయటానికి. అనంతపురం ఎంపీతో పాటు తాడిపత్రి అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకోకుండా జిల్లా మొత్తాన్ని తమ గిప్పిట్లో పెట్టుకోవాలన్న వీళ్ళ ఆలోచనతో  మొదటికే మోసం వచ్చేట్లుంది.


వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా కాకుండా తన కొడుకు జేసీ పవన్ రెడ్డిని ఎంఎల్ఏగా పోటీచేయించాలన్నది మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. మరి మాజీ ఎంఎల్ఏ వైకుంఠం ప్రభాకరచౌదరి ఏమవ్వాలి ? ఇక్కడే ప్రభాకర్ కు జేసీ బ్రదర్స్ ఎర్త్ పెడుతున్నారట. ప్రభాకర్ కు జేసీకి చాలాకాలంగా ఉప్పునిప్పుగా ఉంది వ్యవహారం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అసలు జేసీ బ్రడర్స్ నే పోటీచేయమని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారట.

వచ్చే ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవి కాబట్టి ఎలాంటి ఛాన్సు తీసుకోదలచుకోలేదని జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు స్పష్టంగా చెప్పారట. అయితే వీళ్ళు మాత్రం వారసులనే రంగంలోకి దింపాలనే పట్టుదలతో ఉన్నారట. అనంతపురం సంగతి ఇలాగుంటే కల్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, పుట్టపర్తి, శింగనమలలో కూడా తమ మద్దతుదారులకే టికెట్లివ్వాలని పట్టుబడుతున్నారట. దాంతో జేసీల శతృవులంతా ఏకమవుతున్నట్లు జిల్లాలో టాక్ మొదలైంది.

అసలు జిల్లాలో సమస్యే జేసీ బ్రదర్సంటు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు చంద్రబాబు దగ్గర మొత్తుకుంటున్నారట. సమస్య ఏమిటంటే వీళ్ళని చంద్రబాబు పార్టీలో నుండి బయటకు పంపేయలేరు. అలాగని వీళ్ళ గోలను భరించనూలేరు. నోటికెంతొస్తే అంత మాట్లాడేస్తు, ఎవరిని పడితే వాళ్ళపై కామెంట్ చేస్తు అందరినీ కంపుచేసేస్తున్నారు. బ్రదర్స్ ఇద్దరు నిత్యసమ్మతిగా పేరుతెచ్చుకున్నారు.  వీళ్ళని వచ్చే ఎన్నికలవరకు భరించక చంద్రబాబు+తమ్ముళ్ళకు వేరేదారిలేదు.  వీళ్ళు పార్టీని కంపుచేసినా భరించాల్సిందే తప్ప వీళ్ళని కంట్రోల్ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: