శాండల్‌వుడ్‌ దాటి ప్యాన్‌ ఇండియా చిత్రంగా మారిన కాంతారా చుట్టు కొత్త వివాదం ముసురుకుంది. రిషబ్‌ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వం లో వచ్చిన కాంతారా గొప్ప హిట్‌ టాక్‌ తెచ్చుకుందట

ఈ చిత్రంలోని కొన్ని సంప్రదాయాలపై ఇటీవల కొన్ని వివాదాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని ఒక పాటపై ఏకంగా కాపీరైట్‌ ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నాయి. కాంతారా చిత్రంలో వరాహ సాంగ్‌ బాగా హిట్‌ అయిందని తెలుస్తుంది. అది మ్యూజిక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోందట. వరాహ రూపం పాటను ఐదారేళ్ల క్రితమే నవరసం పేరుతో ఈ మ్యూజిక్‌ బ్యాండ్‌ విడుదల చేసిందట. కాగా యూట్యూబ్‌లో ఈ పాటకు 42 లక్షల వ్యూస్‌ ఉన్నాయి. ఈ నవరస పాట, వరాహ రూపం రెండింటిని చూస్తే పెద్దగా తేడా అనిపించదు. నవరస పాటలోని ఆర్కెస్ట్రాను కాంతారాలోని వరాహారూపం పాటకు యథాతథంగా తీసుకున్నారని మ్యూజిక్‌ బ్యాండ్‌ తెక్కుడం బ్రిడ్జి కూడా ఆరోపిస్తోంది. ఈ పాటను ఉపయోగించుకుంటున్నందుకు కనీసం తమకు కరెస్టీ కూడా ఇన్వలేదని అంటోంది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని అంటోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదును తమ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన తైక్కుడం బ్రిడ్జి దీనికి కాంతార నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్‌ చేసిందట.

మరో వైపు కాంతారా చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీశ్‌ ఈ ఆరోపణలను అయితే కొట్టిపారేస్తున్నారు. రెండు పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల ఒకేలాగా అనిపిస్తోందని అంటున్నారు. అయితే నిర్మాతలు, దర్శకుడు ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఈ కలెక్షన్ల ప్రభంజనం కురిపిస్తోందట.కన్నడలో ఇప్పటికే 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ వసూళ్లు రాబడుతోందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: