ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనల్ని ఏదొక రకంగా డబ్బుల ను గుంజెస్తున్నారు సైబర్ నేరగాల్లు..ఇటీవల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి..ఇప్పుడు మొబైల్ నెట్ వర్క్ను టార్గెట్ చేస్తూ జనాలను భయంతో చంపెస్తున్నారు. విషయానికొస్తే.. భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. జియో, ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన నగరాల్లో తమ సేవలను అందిస్తున్నాయి. ఈ సర్వీస్ ప్రొవైడర్లు క్రమంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి..సేవల గురించి మరింత సమాచారాన్ని అందిస్తూ వస్తున్నారు..


5G ప్రారంభంతో, స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ప్రజలను ట్రాప్ చేసేందుకు స్కామర్లు 5జీని ఆశ్రయిస్తున్నారు. జియో, ఎయిర్ టెల్ 5g సేవను ప్రారంభించాయి. అయితే Vi, bsnl వినియోగ దారులు 5g కోసం మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. 5g గురించి ప్రజల్లో చాలా ఉత్సాహం ఉన్నందున, స్కామర్లు అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో బిజీగా ఉన్నారు. 5జి సేవలను టార్గెట్ చేశారు.. దీనికి సంబందించిన విషయాలు కొన్ని వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా యూజర్లు స్కామర్ల టార్గెట్‌లో ఉన్నారు. కారణం, ఈ టెలికాం తన 5g సేవను ఇంకా ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోసగాళ్లు సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు..


4 జీ నుంచి 5జి కి సేవలను అందిస్తున్నాము అని చెబుతూ వస్తున్నారు.. అందుకు సంబందించిన మెసేజ్ లు కూడా వస్తున్నాయి.. వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు మాత్రమే ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని అనుకంటే పొరబడినట్లే. 5జి సిమ్ అప్‌గ్రేడ్ పేరు తో జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులను ట్రాప్ చేయడానికి స్కామర్లు ప్రయత్నిస్తున్నారు. 5g కోసం మీకు కొత్త సిమ్ కార్డ్ అవసరం లేదని కంపెనీలు ఇప్పటికే క్లియర్ చేశాయి. మీరు ఇప్పటికే ఉన్న మీ సిమ్ కార్డ్‌లో 5g సేవను ఉపయోగించగలరు. అదే సమయంలో, వొదాఫొన్ ఐడియా ఇంకా 5g లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: