ఇక గత కొంతకాలం నుంచి సంచలనం సృష్టిస్తున్న నవీన్
హత్య కేసులో ప్రియురాలు పేరుని కూడా చేర్చారు పోలీసులు.
హత్య జరిగిన తరువాత ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలని వాట్సాప్‌లో పంపాడు హరిహర కృష్ణ.పోలీసుల కస్టడీలో ఆ యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు
హరి హర కృష్ణ. దీంతో ఆమెను కూడా ఈ హత్యలో నిందితురాలుగా చేర్చారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. తను ప్రేమించిన యువతి కోసమే నవీన్‌ను
హత్య చేసినట్టు కస్టడీలో ఒప్పుకున్నాడు
హరి హర కృష్ణ. దీంతో ప్రియురాలు నిహారికను కూడా
అరెస్ట్ చేశారు పోలీసులు.
హత్య తరువాత హరిహర
కృష్ణ మిత్రుడు హసన్ ఇంటికి వెళ్లి.. అతడికి కూడా వివరాలు చెప్పి.. స్నానం చేసి నెత్తుటితో తడిసిన తన బట్టలు మార్చుకున్నాడు హరిహర కృష్ణ.అయితే ఆ సమాచారం అతడు పోలీసులకు ఇవ్వలేదు. దీంతో ఇక హసన్‌ను కూడా ఒక నిందితుడిగా చేర్చారు పోలీసులు. జరిగిన నేరాన్ని దాచి పెట్టడం కూడా నేరమే.. అందుకే వీరిద్దర్నీ కూడా నిందితులుగా చేర్చినట్లు సమాచారం తెలుస్తోంది.
నవీన్
హత్య కేసులో ఏ2గా హసన్ ఇంకా ఏ3గా యువతి
నిహారిక ని చేర్చారు.నవీన్‌ను హరిహరకృష్ణ ఒక్కడే
హత్య చేశాడని డీసీపీ సాయిశ్రీ చెప్పారు.
హత్య చేసిన విషయాన్ని స్నేహితుడు హసన్‌కు చెప్పాడని వెల్లడించారు. ఈ
హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ పారిపోయి.. ఖమ్మం, విజయవాడ,
విశాఖ ఇంకా వరంగల్‌కు వెళ్లాడని డీసీపీ వివరించారు. ఈ
హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత 1500 రూపాయలు
నిహారిక హరిహరకు ట్రాన్స్‌ఫర్ చేసిందని కూడా వివరించారు. గత నెల 24 వ తేదీన తిరిగి వచ్చి యువతి, హసన్‌ను హరిహరకృష్ణ కలిశాడని తెలిపారు. ఇక లొంగిపోవడానికి ముందు నవీన్‌ను చంపిన చోటుకు యువతిని, హసన్‌ను హరిహర
కృష్ణ తీసుకెళ్లాడని కూడా డీసీపీ వెల్లడించారు.ఇక నిందితురాలు
నిహారిక తన ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్ చేసిందని… ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని కూడా పోలీసులు తెలిపారు.
హత్య విషయం తెలిసినా కూడా వీరు ఇద్దరూ పోలీసులకు చెప్పలేదని.. అందుకే వారిని కూడా
అరెస్ట్ చేశామని వెల్లడించారు.