విజయమో వీరస్వర్గమో అని తెగించాల్సిన సమయం వచ్చేసిందా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రెండురోజుల ఢిల్లీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయినట్లు అర్ధమైపోతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకునేట్లుగా బీజేపీతో మాట్లాడటం కూడా ఢిల్లీ పర్యటన అజెండాలో ఉందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అయితే బీజేపీ స్పందన ఏమిటని అడిగిన మీడియాకు నాదెండ్ల సమాధానం చెప్పలేదు. దాంతోనే తెలిసిపోతోంది పవన్ ప్రతిపాదనను బీజేపీ పట్టించుకోలేదని.




 సో, పవన్ ముందున్న ఆప్షన్ ఒకటే. ఉంటే బీజేపీతోనే కంటిన్యు అవటం. లేదంటే బీజేపీని విడిచిపెట్టేసి టీడీపీతో చేతులు కలపటం. అయితే ఇది పైకి చెప్పుకుంటున్నంత ఈజీకాదు. మిత్రపక్షాలను బీజేపీ వదిలేస్తే ఒకపద్దతిగా ఉంటుంది. అదే మిత్రపక్షాలు ఏవైనా బీజేపీని వదిలించుకోవాలంటే అంత వీజీకాదు. తమను వదిలించుకోవాలని లేదా వదిలించుకున్న పార్టీల పరిస్ధితి ఏ విధంగా తయారయ్యాయో మిగిలిన రాష్ట్రాల్లో చూస్తున్నాం.




ఇక్కడే పవన్ కు పెద్ద సమస్య వచ్చేసింది. బీజేపీతో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే తన లక్ష్యం నెరవేరదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ చూస్తు ఊరుకోదు. అందుకనే ఏదైతే అది అయ్యిందని తెగించాల్సిన సమయం వచ్చేసింది. రాజకీయాల్లో ఒక్కోసారి డేరింగ్ స్టెప్ తీసుకోవాల్సొస్తుంది. లాభమా నష్టమా అని ఆలోచిస్తు కూర్చుంటే ఏ పనీ జరగదు. అందుకనే విజయమో వీరస్వర్గమో అని తెగించాలి. బీజేపీ నుండి ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని పవన్ తెగించాల్సిన సమయం వచ్చేసింది.





అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. బీజేపీ నుండి పవన్ కు సమస్య వస్తే ఏదోలా మ్యానేజ్ చేస్తారనే అనుకుందాం. తమను కాదనుకున్న పవన్ తో పొత్తు  పెట్టుకున్న కారణంగా  చంద్రబాబుకు కూడా ఇబ్బందులు మొదలైతే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? పవన్ కంటే ఉన్నదేమీ లేదు కాబట్టి కొత్తగా  పోయేదేమీ లేదు. కానీ చంద్రబాబుకు అలాకాదు. రాజకీయంగా క్లైమాక్సుకు చేరుకుంటున్న ఈ దశలో  బీజేపీ వెంటపడితే తట్టుకునేంత సీన్ చంద్రబాబుకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: