సింగరేణి అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే సింగరేణి.. ఇప్పటి వరకూ ఉన్న సీన్ ఇది. ఇక ఇప్పుడు ఇది మారబోతోంది. సింగరేణి ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో దూసుకుపోతున్న ఈ బొగ్గు గని సంస్థ ఇప్పుడు ఒడిశాలోనూ గనులను దక్కించుకుంటోంది. తాజాగా ఒడిశాలోనూ న్యూపాత్రపాద గనిని కేంద్రం సింగరేణికి కేటాయించింది. ఈ గని ద్వారా ఏడాదికి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంతో సింగరేణికి ఇది బంపర్ ఆఫర్ గానే చెప్పాలి.


సింగరేణి సంస్థ తన వ్యాపార అవకాశాలను విస్తరించుకుంటోంది. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను పొందేందుకు సంస్థ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అవి ఇప్పటికి ఫలిస్తున్నాయి. ఒడిశాలోని ఛండీపడ తహసీల్‌ పరిధిలోని న్యూ పాత్రపాద బొగ్గు గనిని సింగరేణి సంస్థకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అప్పగించింది. ఇలా వేరే రాష్ట్రాల్లో బొగ్గు గనులను కేటాయించాలంటే ఆ సంస్థ హిస్టరీ చాలా బావుండాలి. గనులు తవ్వగలిగే సామర్థ్యమూ ఉండాలి.


ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే కేంద్రం మొత్తం మూడు బ్లాకులను కలిపి న్యూ పాత్రపాద పేరుతో సింగరేణి సంస్థకు కేటాయించింది. ఇక ఈ కొత్త గనికి సంబంధించిన వివరాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే ఏడాదికి 200 లక్షల టన్నుల బొగ్గు తీయొచ్చట. మొత్తం 3,108 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గని విస్తరించి ఉంది. సింగరేణి ఇక్కడ బొగ్గు తవ్వేందుకు మొదటి బ్లాకుకు అన్నిరకాల అనుమతులు వచ్చేశాయని సింగరేణి యాజమాన్యం తెలిపింది. మిగిలిన రెండు బ్లాకుల్లో బొగ్గు అన్వేషణ పూర్తి చేయాల్సి ఉందట.


సింగరేణకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ గనుల్లో బొగ్గు చాలా తక్కువ లోతులోనే దొరుకుతుంట. అంటే.. పెద్దగా ఎక్కువ ఖర్చు చేయకుండానే.. బొగ్గు తీయొచ్చన్నమాట. దీని ద్వారా ఉత్పత్తి వ్యయం బాగా తగ్గి లాభాలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే.. మరో 50 ఏళ్ల వరకూ సింగరేణికి ఢోకా ఉండదట.


మరింత సమాచారం తెలుసుకోండి: