ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రలో ఎం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రులు మరీనా సమయం నుండి రాజధాని మారుతుంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. ఆలా జరిగిన ప్రచారానికి ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు కూడా బలాన్ని చేకూర్చాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మారుతుంది అని ప్రచారం జోరుగా జరిగింది. 

          

అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు అని అనుకుంటున్నారా ? ఆ విషయానికే వస్తున్న. ఆంధ్రకి రాజధాని లేదా అని అడిగితే కేంద్రం లేదనే చెప్తుంది. ఇప్పటికి ఆంధ్రాకి హైదరాబాద్రాజధాని అని చెప్తున్నారు. ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి. కావాలని చేశారో.. తెలియక చేశారో తెలియదు కానీ. చివరికి ఏపీకి రాజధాని లేకుండా చేశారు. 

             

ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..అని అనుకుంటున్నారా ? తాజాగా కేంద్రం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ ప్రభుత్వం భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 

             

అయితే కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అన్ని రాష్ట్రాలకూ.. రాజధానులు ఉన్నట్టు తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి మాత్రం రాజధాని లేనట్టు చూపింది. ఏపీ రాజధాని మ్యాప్‌లో లేకపోవడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక్క ప్రజలే కాదు.. రాజకీయనాయకుల సైతం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఈ విషయంపై కేంద్రం ఏలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: