ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతో ఆర్థికంగా చాలా నష్టపోయిందని చేతిలో ఉన్న డబ్బులతో ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏవిధంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల జీవితాలలో మేలు చేయాలి అన్న దాని విషయంలో సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర పరిస్థితి గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వికేంద్రీకరణ బిల్లు చర్చ జరుగుతున్న సందర్భంలో సీఎం జగన్ ప్రసంగించడం జరిగింది.

 

ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అసెంబ్లీ లో వివిధ అంశాల గురించి మాట్లాడిన సందర్భంలో బీజేపీ మేనిఫెస్టో ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో ని సీఎం జగన్ చదువుతూ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఎన్నికల ప్రణాళికలో కర్నూలులో హైకోర్టు పెడుతున్నట్లు హామీ ఇవ్వటం జరిగింది అలాగే అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన భూ సేకరణ విషయంలో భూములను కోల్పోయిన రైతులకు తిరిగి భూములు ఇచ్చే కార్యక్రమం బిజెపి అధికారంలోకి వస్తే చేపట బోతున్నట్లు వైయస్ జగన్ బీజేపీ మేనిఫెస్టో అసెంబ్లీలో చదవటం జరిగింది.

 

అయితే ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటూ జగన్ మండిపడ్డారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వెంటనే టిడిపి నుండి బీజేపీ లోకి జంప్ అయిన సుజనాచౌదరి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వైయస్ జగన్. రాజధాని అమరావతి అంగుళం కూడా కదలదు అని కామెంట్లు చేసినా సుజనా చౌదరి వ్యాఖ్యలను బీజేపీ పార్టీ పెద్దలు పట్టించుకోవాలని ఇలాంటి నాయకులను పార్టీలో లేకుండా తన్ని తరమాలి అని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

 

దీంతో ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు పార్టీలో సుజనాచౌదరి పార్టీ కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా కోవర్టుగా గత కొంత కాలం నుండి వ్యవహరిస్తున్నట్లు తేలిందని సుజనా చౌదరి అనుసరిస్తున్న విధానం బిజెపి పార్టీ పెద్దలకు నచ్చటం లేదని పార్టీ నుండి బయటకు పంపే వేటు..., పార్టీ పెద్దలు రెడీ చేస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: