15 వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని మేధావులు, ఆర్థిక వేత్తలు పదే పదే చెపుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అదే నిజమైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం నాలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అసలే ఆర్థిక మాంద్యం వల్ల కేంద్రానికి వచ్చే పన్నులు తగ్గిపోతున్నాయి. కేంద్రానికి పన్నులు తగ్గితే రాష్ట్రానికి వచ్చే పంపకాలు కూడా తగ్గుతాయి. ఇలాంటి నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు దక్షిణాది రాష్ట్రాల పేరిట శాపంగా మారాయి.

నిజానికి ఆర్థిక సంఘం లెక్కలు 1970 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం చేయడమే అసలు సమస్యగా మారింది. 1970 కి 2011 కి తేడా ఏమిటన్నది అందరి ప్రశ్న. ౧౯౭౦ తర్వాత జనాభా నియంత్రించాలని అనుకున్నప్పుడు కుటుంబ నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు చాలా కట్టడిగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అంత సీరియస్ గా తీసుకోలేదు. దానివల్ల అక్కడ జనాభా పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల జనాభా చాలా ఎక్కువ. జనాభాని నియంత్రించడంలో దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నిధులని పంచడం వల్ల తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జనాభాని నియంత్రించిన కారణంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ ఎనిమిది రాష్ట్రాలలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే కావడం గమనార్హం.

ఒక్క తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలన్నింటిదీ ఒకే పరిస్థితి. దీనివల్ల తెలంగాణకి సంవత్సరానికి 2383 కోట్ల నష్టం వస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా 12000 కోట్లు అన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏడాదికి 1500 కోట్ల రూపాయల నష్టం చవి చూస్తుంది. జనాభాని పెంచుకుంటూ పోయిన ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం విపరీతంగా లాభపడుతున్నాయి. జనాభాని నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం మంచి సత్కారమే చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: